Begin typing your search above and press return to search.
జగన్ సీఎస్‌ను తప్పించడానికి కారణం ఆ శక్తులేనా...?
By: Tupaki Desk | 4 Nov 2019 3:21 PM GMTఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి కావడం కొన్ని శక్తులకు ఏ మాత్రం ఇష్టం లేదని వైసీపీలోని కొందరు కీలక నేతలు ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సహా చాలా మంది ఆయన్ను అధికారం నుంచి దించడానికి అప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేని కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో జగన్ సర్కార్ పై అనేక విమర్శలు చేశారు. కర్నాటకకు చెందిన ఒక వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ౦పై... ప్రభుత్వ ఉగ్రవాదమని వ్యాఖ్యలు చేసారు.
ఇక కొన్ని చంద్రబాబు అనుకూల మీడియా అయితే జగన్‌పై ఎవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే హైలెట్ చేయడం... ప్రభుత్వంపై వ్యతిరేకత తారా స్థాయిలో ఉందని కథనాలు రాయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక కొందరు కార్పోరేట్ శక్తులు కూడా జగన్ పై కక్ష సాధింపు వైఖరితో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు దీనికి కారణం ఏంటి అనేది తెలియకపోయినా ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది.
జగన్ విషయంలో ఇటీవల కోర్ట్ ఇచ్చిన ఒక తీర్పు తర్వాత ఆయన రాజీనామా చెయ్యాలని డిమాండ్లు మొదలుపెట్టింది చంద్రబాబు అనుకూల మీడియా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న లొసుగులను, దృష్టిలో పెట్టుకుని కొందరు కీలక అధికారుల ద్వారా కుట్రలు చేసారనే సమాచారం జగన్ కి అందింది. దీనితో వెంటనే జగన్ ప్రక్షాళన మొదలుపెట్టారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకే ఎన్నికల సంఘం నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యంని జగన్ తప్పించారు.
త్వరలోనే మరికొందరు అధికారులను కూడా ఆయన తప్పించే సూచనలు కనపడుతున్నాయి. దీనితో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులలో కలవరం మొదలయింది. కార్పోరేట్ శక్తులతో సంబంధాలు ఉన్న అధికారులలో కంగారు మొదలయింది. వారు జగన్ ప్రభుత్వ లోపాలను మోస్తున్నారనే అనుమానం జగన్ కొందరి వద్ద బహిరంగంగానే వ్యక్తం చేశారట