Begin typing your search above and press return to search.
ఎంఎల్సీనే బెదిరిస్తున్నారా ?
By: Tupaki Desk | 1 July 2021 3:30 PM GMTమామూలుగా అయితే ప్రతిపక్షంలో ఉన్న నేతలకు లేకపోతే ప్రజాప్రతినిధులకు బెదిరింపులు రావటం సహజమే. కానీ అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధికి అందులోను సీఎం జిల్లాలోని నేతకే బెదిరింపులు వస్తుంటే ఏమనర్ధం ? ఇంతకీ విషయం ఏమిటంటే కొత్తగా ఎంఎల్సీగా ఎన్నికైన రమేష్ యాదవ్ కు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.
రమేష్ ఎంఎల్సీ ఎన్నిక రెండు వారాలైయ్యుంటుంది. గవర్నర్ కోటాలో నామినేట్ అయి, బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజునుండే రమేష్ కు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయట. నీకు ఎంఎల్సీ పదవి కావాల్సొచ్చిందా ? నీ స్ధాయేంటో నీకు తెలుసా ? అంటు అడుగుతున్నారట. మరోసారి ఎంఎల్సీ పదవిని ఎంజాయ్ చేయ్ అంతేకానీ గ్రూపులు కట్టాలని ప్రయత్నిస్తే బాగుండదు అంటు గుర్తుతెలీని వ్యక్తులు బెదిరించారట.
రెగ్యులర్ గా తనకు ఫోన్లు వస్తుండటంతో ఆ ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేయటానికి ఎంఎల్సీ చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయట. మొదట్లో ఫోన్ కాల్స్ ను లైటగా తీసుకున్నా తర్వాత తరచూ అలాంటి బెదిరింపు కాల్సే వస్తుండటంతో లాభం లేదని నేరుగా పోలీసులకే ఫిర్యాదు చేశారట. అయితే పోలీసుల విచారణలో కూడా బెదిరింపు ఫోన్లు ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయం తేలలేదని సమాచారం.
పార్టీపరంగా చూస్తే రమేష్ కు పార్టీలో పెద్దగా ప్రత్యర్ధులు ఎవరు లేరు. ఎందుకంటే రమేష్ కు పార్టీలో చెప్పుకోతగ్గ స్ధాయేమీలేదు. కాబట్టి గ్రూపులు కట్టేంత సీన్ ఎంఎల్సీకి లేదు. ప్రొద్దుటూరు ఎంఎల్సీ రాచమల్లు శివప్రాసదరెడ్డితో రమేష్ కు మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కాబట్టి నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు లేనట్లే. మిగిలిన నియోజకవర్గాల్లో ఎంఎల్సీకి పెద్దగా పనుండదు. మరలాంటపుడు రమేష్ కు ఎందుకిలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయో ఎవరు చెప్పలేకపోతున్నారు. చివరకు పోలీసుల దర్యాప్తులో ఏమి తేలుతుందో చూడాల్సిందే.