Begin typing your search above and press return to search.
జనసేనకు ఏడుగురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా...?
By: Tupaki Desk | 7 Nov 2022 10:31 AM GMTఏపీ రాజకీయాల్లో జనసేన ఇపుడు కీలకంగా మారుతోంది. గ్రాఫ్ అంతకంతకు పెంచుకుంటున్న జనసేన విషయంలో రాజకీయ నాయకులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన కీలకమైన భూమిక పోషిస్తుంది అన్నది విశ్లేషణగా ఉంది. దాంతో జనసేన విషయంలో రాజకీయ గోడ దూకుళ్ళు కూడా మొదలయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం చూస్తే ఏపీలో ప్రచారం అవుతున్న వార్త ఏంటి అంటే కనీసంగా ఏడుగురు ఎమ్మెల్యేలు జనసేనకు టచ్ లో ఉన్నారని. మరి ఆ ఏడుగురు ఎవరు, ఏ జిల్లాకు చెందిన వారు అన్నది కనుక చూస్తే చాలా ఇంటరెస్టింగ్ మ్యాటరే ఉంది.
ఏపీలోని ప్రకాశం జిల్లా నుంచి ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇద్దరు, తూర్పు గోదావరి నుంచి ఇద్దరు, విశాఖ నుంచి ఒకరు, విజయనగరం నుంచి ఒకరు జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికే జనసేనకు టచ్ లోకి వచ్చారని అంటున్నారు. అయితే వైసీపీలో తమకు ఇక సీట్లు రావు అని వారు డిసైడ్ అయితే కనుక కచ్చితంగా జనసేనలోకి జంప్ అవుతారని అంటున్నారు.
అదే విధంగా తమ నియోజకవర్గాలలో కుల సమీకరణలు రాజకీయ పరిణామాల వల్ల కూడా వారు జనసేన వైపునకు వస్తారనని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు అనందే ఇపుడు అంతా ఆరా తీస్తున్న విషయం. ఈ ఎమ్మెల్యేల విషయంలో వైసీపీ హై కమాండ్ కూడా గ్రాఫ్ సరిచూసుకోమని హెచ్చరికలు పంపుతోందని, పైగా ఆయా నియోజకవర్గాలలో వీరి పనితీరు పట్ల వ్యతిరేకత ఉందని సర్వేల ద్వారా వైసీపీ అంచనా వేస్తోంది అని అంటున్నారు.
దాంతో తమకు టికెట్లు దక్కవని వీరు భావించి జనసేన వైపు వస్తున్నారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అయితే జనసేనకు ఒక బలమైన సామాజికవర్గం అండగా ఉంది. దాంతో ఆ సామాజికవర్గానికి చెందిన వారే ఆ పార్టీకి ఎదురునిలిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఈ విధంగా ముందే జెండా మార్చేసే పనిలో పడ్డారని అంటున్నారు. అలాగే ఈ ఎమ్మెల్యేలు ఈసారి కొత్త పార్టీలో చేరితనే గెలుపు సాధ్యమని భావించి కూడా ఆ దిశగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.
ఇప్పటిదాకా వేరు ఎక్కడా బయటపడకపోవడానికి కారణం సింగిల్ గా జనసేన పోటీకి దిగితే తమకు ఇబ్బంది అవుతుంది అని భావించడమే అంటున్నారు. అయితే జనసేన టీడీపీ కలిస్తే కచ్చితంగా సామాజికసమీకరణలు, ఇతర రాజకీయ అంశాలు అనుకూలించి గెలుపు ఖాయమనే భావనకు వచ్చాకనే వీరు జూలు విదిలిస్తున్నారు అని అంటున్నారు. ఎటూ మూడున్నరేళ్ళ వైసీపీ పాలన పూర్తి అయింది. ఇక మిగిలింది గట్టిగా పనిచేస్తే ఏడాది. అందువల్లనే వీరిపుడు ఫ్యూచర్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి జనసేనకు టచ్ లోకి వచ్చారు అని అంటున్నారు.
అదే టైం లో తమ ప్రాంతంలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ వల్ల కూడా వీరు ఆ పార్టీ వైపు టెంప్ట్ అయ్యారని అంటున్నారు. ముందుగానే కర్చీఫ్ వేస్తే అక్కడ టికెట్లు తమకే కన్ ఫర్మ్ అవుతాయన్న దూరాలోచనతోనే వీరు ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఏడుగురుతో జనసేన భారీ బోణీ కొడితే మాత్రం అధికార వైసీపీ గింగిరాలు కొట్టడం ఖాయమే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.