Begin typing your search above and press return to search.
కీలకమైన జిల్లాలో ఆ మూడు సీట్లు జనసేనకేనా?
By: Tupaki Desk | 27 Dec 2022 7:32 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని జనసేనాని పవన్ కల్యాణ్ చెబుతున్న సంగతి తెలిసిందే. వైసీపీని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలసి రావాలని ఆయన కోరుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోననే అంటున్నారు. అలాగే వైసీపీ వచ్చే సారి అధికారంలోకి రాదని తేల్చిచెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన- టీడీపీ మధ్య పొత్తు ఖాయమని అంతా భావిస్తున్నారు. వైసీపీ నేతలు ఇది గ్రహించే దమ్ముంటే పవన్ ఒంటరిగా పోటీ చేయాలని.. 175 సీట్లలోనూ అభ్యర్థులను నిలపాలని సవాల్ చేస్తున్నారు. జనసేన-టీడీపీ పొత్తు కుదిరితే వచ్చే ఫలితమేంటో వైసీపీ నేతలకు తెలుసు కాబట్టే వారు ఇలా సవాళ్లు చేస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఇరు పార్టీల మధ్య పొత్తు ఖాయమని.. నియోజకవర్గాల్లో నేతలు సైతం మానసికంగా సిద్ధమై పోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సీట్లను ఆ పార్టీకే కేటాయించే ఉద్దేశంతో టీడీపీ ఉందని చెబుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెనాలి, గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి స్థానాలను జనసేనకు పొత్తులో కేటాయించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
తెనాలిలో జనసేన తరఫున ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెబుతున్నారు. అలాగే సత్తెనపల్లిలో జనసేన తరఫున ఒక మాజీ ఎమ్మెల్యే పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. గతంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన యర్రం వెంకటేశ్వరరెడ్డి జనసేన తరఫున బరిలోకి దిగొచ్చని వార్తలు వస్తున్నాయి.
ఇక గుంటూరు పశ్చిమ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేన నుంచి బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది. ఇటీవల కన్నా జనసేనలో చేరతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అతి త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో కీలకమైన గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ స్థానాలను జనసేనకు వదిలివేయాలని టీడీపీ నిర్ణయించిందని అంటున్నారు. దానికి తగ్గట్టే ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం టాక్ నడుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.