Begin typing your search above and press return to search.
కరోనా కట్టడికి రెండు డోసులు చాలవా? మూడో డోసు అవసరమా?
By: Tupaki Desk | 28 April 2021 1:30 PM GMTకరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. గతకొద్ది రోజుల నుంచి 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్ కి టీకా ఇవ్వగా అనంతరం 45 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ టీకా ఇవ్వనున్నారు.
వ్యాక్సిన్ ఇచ్చిన పలువురు వైరస్ బారిన పడ్డారు. రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే వారిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వ్యాక్సిన్ తీసుకోని వారు ఇతర సమస్యలు ఎదుర్కోగా... టీకా తీసుకున్నవారు స్వల్ప ప్రభావంతో వైరస్ నుంచి విముక్తి పొందగలుగుతున్నారు. టీకా రెండు డోసులు పూర్తైనా కరోనా సోకడంపై ప్రస్తుతం ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
రెండు డోసుల అనంతరం ఆరు నెలల తర్వాత మూడు డోసు తీసుకుంటే వైరస్ని సమర్థవంతంగా ఎదుర్కొవచ్చు అని పలువురు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొవిడ్ కు పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ఏటా బూస్టర్ డోసు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ టీకాలు తీసుకున్నవారికి ఈ ఏడాదిలో మరో బూస్టర్ అవసరమని ఆ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అన్న నేపథ్యంలో.. మరో ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు అవసరమని కొవాగ్జిన్ ను రూపొందించిన భారత్ బయోటక్ సంస్థ ప్రతిపాదించింది.
మూడో డోసు ఎంతవరకు అవసరం అన్న అంశపై పరిశోధనలు జరుగుతున్నాయి. తమిళనాడుకు చెందిన ఎన్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సంస్థ దీనిపై విస్తృతంగా పరిశోధిస్తోంది. కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న ఏడుగురికి మూడో డోసు ఇచ్చి అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించింది. మూడో డోసు తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో అధ్యయనం చేస్తున్నట్లు వివరించింది. మూడో డోసు దీర్ఘకాలిక మెమోరీ కణాలు, ప్లాస్మా కణాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో నమోదు చేస్తున్నట్లు పేర్కొంది.
వ్యాక్సిన్ బూస్టర్ డోసులపై వివిధ రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదు. రోగనిరోధక శక్తి ప్రతిస్పందనలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్తోనే మహమ్మారికి కొంతవరకు అడ్డుకట్టవేయగలమని చెబుతున్నారు.