Begin typing your search above and press return to search.

బలవంతంగా అంటకడుతున్నారా ?

By:  Tupaki Desk   |   24 Sept 2022 10:52 AM IST
బలవంతంగా అంటకడుతున్నారా ?
X
క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాత్ పోటీచేస్తున్న విషయం తెలిసిందే. సోనియా ఆశీస్సులు కారణంగా బహుశా మంచి మెజారిటితో గెలవచ్చు కూడా. అయితే అధ్యక్షుడిగా గెలిచి గెహ్లాట్ చేసేదేముంటుంది ? సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోవడం లేదు.

దేశంలో కాంగ్రెస్ వైభవం పోయి దాదాపు ఎనిమిదేళ్ళయిపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీయేనే అధికారంలోకి రాబోతోందనే విశ్లేషణలు అందరు చూస్తున్నదే. ఒకవేళ యూపీఏ లేదా నాన్ ఎన్డీయే పార్టీల బలం పెరుగుతుందే అని అనుకున్నా అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఎవరిలోను లేదు. మరలాంటపుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి లాభం ఏమిటి ? పైగా పెద్ద రాష్ట్రమైన రాజస్ధాన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సొస్తోంది.

ముఖ్యమంత్రి పదవి బెటరా ? లేకపోతే కాంగ్రెస్ అధ్యక్ష పదవి బెటరా అని అంటే సీఎం పదవే బెటరంటారు ఎవరైనా. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడంటే దాదాపు ప్రధానమంత్రికి సమాన స్థాయిలో అధ్యక్షపదవి ఉండేది కాబట్టి డెఫినెట్ గా అధ్యక్ష పదవే బ్రహ్మాండమంటారు. ఇపుడు సమస్య ఏమిటంటే అశోక్ ను గాంధీ కుటుంబం బలవంతంగా అధ్యక్ష పదవికి పోటీలోకి దింపినట్లే ఉంది. అశోక్ మాట్లాడుతున్న తీరుచూస్తుంటే తనకిష్టంలేకపోయినా అధ్యక్షపదవి పోటీలోకి బలవంతంగా దింపుతున్నట్లే అనుమానంగా ఉంది.

ఈ అనుమానం కారణంగానే అధ్యక్ష బాధ్యతలతో పాటు ముఖ్యమంత్రిగా కూడా కంటిన్యు అవుతానని అశోక్ కండీషన్ పెట్టింది. అయితే ఆయన కండీషన్ కు సోనియా, రాహుల్ ఇద్దరూ అంగీకరించలేదు. దాంతో సీఎం పదవిని వదులుకోవటం ఇష్టంలేక, అలాగని కాంగ్రెస్ అధ్యక్షుడి పోటీచేయటం ఇష్టంలేదని చెప్పే ధైర్యం లేక అశోక్ చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిపోతోంది. పైగా రాజస్ధాన్ సీఎంగా తన బద్ధశతృవు సచిన్ పైలెట్ ఎక్కడ కూర్చుంటాడో అనే ఆందోళన మరోవైపు పెరిగిపోతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.