Begin typing your search above and press return to search.
ప్రచారానికైనా వస్తారా? రారా!
By: Tupaki Desk | 8 Oct 2019 9:09 AM GMTఎన్నికలు అయిపోగానే ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాడె పడవేసిన రాహుల్ గాంధీ ఆ తర్వాత రాజకీయాలతో పూర్తిగా అంటీముట్టనట్టుగా తయారయ్యారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్పందించడమే తప్ప రాహుల్ గాంధీ గట్టిగా రాజకీయాలను చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఇంతలోనే రెండు రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానా.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఐదేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండేది. ఐదేళ్ల కిందట అధికారం చేజారింది. పుంజుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది కూడా. ఇలాంటి నేఫథ్యంలో రాహుల్ గాంధీ మాత్రం రాజకీయంగా ఎలాంటి హడావుడి చేయడం లేదని పరిశీలకులు అంటున్నారు.
ప్రస్తుతం రాహుల్ దేశంలోనే లేరనే విషయాన్ని కూడా విశ్లేషకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదని అంటున్నారు. ఎన్నికలు అయ్యాకా రాహుల్ మూడోసారి అలా విదేశీ పర్యటనకు వెళ్లారని అంటున్నారు.
రాహుల్ గాంధీ ఎక్కడనే విషయం గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా చెప్పలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో రాహుల్ కనీసం ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి అయినా వస్తారా, లేక పూర్తిగా మొహం చాటేస్తారా.. అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే రాహుల్ గాంధీ ప్రచారానికి వచ్చి తీరతారని కాంగ్రెస్ పార్టీ లోని కొంతమంది అంటున్నారట!