Begin typing your search above and press return to search.

చిత్ర‌పురి అవ‌క‌త‌వ‌క‌ల‌పై క‌థ‌నానికి కౌంట‌ర్ వేస్తున్నారా?

By:  Tupaki Desk   |   1 July 2021 8:30 AM GMT
చిత్ర‌పురి అవ‌క‌త‌వ‌క‌ల‌పై క‌థ‌నానికి కౌంట‌ర్ వేస్తున్నారా?
X
24 శాఖ‌ల సినీకార్మికుల కోసం కేటాయించిన `చిత్ర‌పురి కాల‌నీ` అవ‌క‌త‌వ‌క‌ల‌పై కొన్నేళ్లుగా పోరాటం సాగుతూనే ఉంది. హౌసింగ్ సొసైటీల ప‌రిధిలో అధికారులు విచార‌ణ సాగిస్తూనే ఉన్నారు. అయితే అధికార పార్టీ నాయ‌కులే ఇందులో ఫ్లాట్లు ద‌క్కించుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో చిత్ర‌పురి వివాదం రోజుకొక మ‌లుపు తిరుగుతోంది.

ఇటీవ‌లే చిత్ర‌పురి అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌ముఖ దిన‌ ప‌త్రిక‌లో సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. చిత్ర‌పురిలో ఎంత‌మంది ప‌రాయివాళ్ల‌కు అపార్ట్ మెంట్లు.. విల్లాలు .. డూప్లెక్సులు ఉన్నాయో స‌ద‌రు క‌థ‌నం విశ‌ద‌ప‌రిచింది. రాజ‌కీయ నాయ‌కులు బ్యాంకు అధికారులు పెద్ద కేడ‌ర్ లో ఉన్న ప్ర‌ముఖుల వివ‌రాల్ని సైతం రివీల్ చేసింది స‌ద‌రు క‌థ‌నం. అయితే దీనికి చిత్ర‌పురి కాల‌నీ క‌మిటీ కౌంట‌ర్ వేసేందుకు రెడీ అవుతోంది. త‌మ చిత్త‌శుద్ధిని నీతిని స‌చ్ఛీల‌త‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోంది.

చిత్ర‌పురిలో అర్హుల‌కు కేటాయింపులు పూర్త‌య్యాక మాపై ఆరోప‌ణ‌లొచ్చాయి. ఇప్పుడు మిగిలిన భ‌వంతుల‌ నిర్మాణం వేగవంతంగా పూర్త‌వుతోంది. ఇలాంటి సమయంలో కొందరు మా ప్రయత్నాల్ని అర్థం చేసుకోకుండా, చిత్రపురిలో అవినీతి జరుగుతోంద‌ని సభ్యులకు అన్యాయం జరుగుతోంద‌ని అసంబద్ధమైన ఆరోపణలతో కావాలని విష ప్రచారం చేస్తున్నారు. చిత్రపురి సొసైటీ ఎంత నిబద్ధతతో పనిచేస్తోంది? అన్న విషయం గౌరవ సభ్యులందరికి తెలుసు.

చిత్రపురిలో సభ్యులు ఆవేదన చెందకుండా.. సినీ రంగమునకు చెందిన సభ్యుల మనస్సులు కలుషితం కాకుండా.. వాస్తవాలను సమాజానికి తెలియజెయ్యాలని అన్ని సందేహాలకు సమాధానం చెప్పాలన్న ఉద్దేశ్యంతో జులై 3 (శనివారం) ఉదయం 11 గంటలకు చిత్రపురి హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నామ‌ని కాల‌నీ అధ్య‌క్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మీడియాకి పిలుపునిచ్చారు.

డాక్టర్ ఎం.ప్రభాకరరెడ్డి చిత్రపురి హౌసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వాల సహకారంతో గ‌త 15 సంవత్సరాలుగా ఇళ్ల నిర్మాణం చేపట్టి సినీ కార్మికులకు అందజేసాం. 2014 లో EWS-224.. LIG-1688.. HIG-720 ఫ్లాట్స్ నిర్మాణం పూర్తిచేసి సభ్యులకు అందజేసాం. ఇప్పుడు MIG -1176.., ROW HOUSE -225 .. HIG DUPLEX -180 కూడా దాదాపు నిర్మాణము పూర్తయి.. కొన్ని ఫ్లాట్స్ లో సభ్యులు గృహప్రవేశములు చేసుకొని నివాసం ఉంటున్నారు.. అని చిత్ర‌పురి హౌసింగ్ సొసైటీ వివ‌ర‌ణ ఇచ్చుకుంది.