Begin typing your search above and press return to search.
నైట్ డ్యూటీలు ఎక్కువగా చేస్తారా? మీకీ ముప్పు పొంచి ఉంటుంది
By: Tupaki Desk | 28 Nov 2019 6:37 AM GMTకాలం మారింది. అందుకు తగ్గట్లు జీవనశైలి మారింది. డిజిటల్ ప్రపంచంలో జీవనవేగం అంతకంతకూ పెరుగుతోంది. కొత్త అలవాట్లు.. మారిన ఆహార అలవాట్ల ధోరణి చివరకూ అనారోగ్యానికి గురి చేసేలా చేస్తుంది. పగటిపూట పని చేయటం.. రాత్రిపోవటం నిద్రపోవటం చేయాల్సింది. మారిన జీవనశైలితో పొద్దున.. రాత్రి అన్న తేడా లేకుండా పని చేయటం పెరిగిపోయింది.
అన్నింటికి మించి రాత్రివేళలో ఉద్యోగం చేసే వారిలో క్యాన్సర్ కు అవకాశం ఎక్కువగా ఉందన్న విషయం తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఇదే కాకుండా టైమ్ పాస్ కోసం చేసుకునే అలవాట్లు కూడాక్యాన్సర్ కు కారణంగా చెబుతున్నారు. సిగిరెట్లు.. గుట్కా.. మందు తాటం లాంటి వాటితో పాటు.. బయటి తిండి ఎక్కువగా తినే వారికి క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటివాటితో మహిళల కంటే పురుషులే ఈ జబ్బుల బారిన పడుతున్నారు.
తీవ్రమైన మానసిక ఒత్తిడి.. వాతావరణ కాలుష్యం.. నైట్ డ్యూటీలు.. రాత్రంతా నిద్ర లేకుండా పని చేయటం.. శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం.. అదే సమయంలో శారీరక శ్రమ తక్కువగా ఉండటం.. లాంటి కారణాలతో క్యాన్సర్ లకు అవకాశం ఉందని తేలింది. మిగిలిన అన్ని కారణాలతో పోలిస్తే మహిళల కంటే పురుషులు మరింత ఎక్కువగా క్యాన్సర్లకు గురి అవుతున్నట్లుగా గుర్తించారు. పునరుత్పత్తి అవయువాలకు సంబంధించిన క్యాన్సర్లు తప్పితే.. మిగిలిన క్యాన్సర్లను తీసుకుంటే మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నట్లు పేర్కొంటున్నారు.
ఇటీవల పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం కూడా పెరిగినట్లుగా హెచ్చరిస్తున్నారు. ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు కుమారుడు దివంగత సుమన్ ఈ కారణంతోనే మరణించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని చూస్తే 2007 నుంచి 2030 వరకు క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం 45 శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య అన్ని మరణాల కంటే ఎక్కువగా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జీవనశైలిలో మార్పులతో పాటు.. యాభైఏళ్లు దాటిన వారు పీఎస్ఏ.. డీఆర్ఈ పరీక్షలు చేసుకోవటం.. వైద్యుల సూచనలకు తగ్గట్లు ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాలన్నది వారి చెప్పినట్లు చేయిస్తే ప్రమాదాన్ని ముందే గుర్తించొచ్చని చెబుతున్నారు.
తగ్గని దగ్గు, దగ్గుతో పాటు రక్తం ఆకలి, బరువు తగ్గడం, నొప్పితో పాటు జ్వరం, మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం మలవిసర్జనలో రక్తస్రావం ,తీవ్రమైన అజీర్తి, గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం.. నోటిలో మానని పుండ్లు, ఎముకల్లో నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. బీకేర్ పుల్.