Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీకి ప్ర‌ధాని ప‌ద‌విని పువ్వులో పెట్ట‌బోతున్నారా?

By:  Tupaki Desk   |   7 July 2021 8:30 AM GMT
రాహుల్ గాంధీకి ప్ర‌ధాని ప‌ద‌విని పువ్వులో పెట్ట‌బోతున్నారా?
X
రాజ‌కీయాల‌లో అనూహ్య‌మైన మార్పులు.. చోటు చేసుకుంటాయి. అయితే.. ఇవి కొంద‌రు నేత‌లు చేసే ప్ర‌య‌త్నాల వ‌ల్ల కావొచ్చు.. లేదా నేత‌ల‌పై వ్య‌తిరేక‌త‌తో కావొచ్చు. ఇప్పుడు దేశంలోనూ ఇదే త‌ర‌హా చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌పై ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ఫాలోయింగ్ లేదు. అదేస‌మ యంలో ఆ పార్టీ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీపైనా సింప‌తీలేదు. కానీ, ఆయ‌న‌కు మాత్రం ప్ర‌ధాని ప‌ద‌వి ల‌భించ‌బోతోందనే ప్ర‌చారం మాత్రం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. బీజేపీపై దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న వ్య‌తిరేక‌తేకార‌ణం అని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేంద్రంలో వ‌ర‌సుగా రెండో సారి కూడా ప్ర‌జ‌లు న‌రేంద్ర మోడీని నెత్తిన పెట్టుకున్నారు. అయితే.. ఆయ‌న రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. ముఖ్యంగా క‌రోనా వేళ అనుస‌రించిన విధానం.. పెట్రోల్ ధ‌ర‌ల పెంపు, నిత్యావస‌రాల పెంపు, నిరుద్యోగం ఇలా.. అనేక కార‌ణాలు మోడీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను పెంచేశాయి.

అయితే.. స్థానికంగా అటు జాతీయ మీడియాను, ఇటు స్థానిక మీడియాను కూడా మేనేజ్ చేస్తూ.. త‌మ‌పై వ్య‌తిరేక‌త రాకుండా చూసుకుంటున్నారు. ఇదే విష‌యాన్ని తాజాగా.. ఓ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. నరేంద్ర మోదీ 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మీడియాను నియంత్రించే ప్రయోగాల కు రాష్ట్రాన్ని వేదికగా చేసుకున్నారు. 2014లో ప్రధాని అయ్యాక దేశ మంతటా విస్తరించారు.

మీడియాలో తన ప్రసంగాలను పుంఖానుపుంఖాలుగా వచ్చేట్లు చేసుకోవడం ద్వారా తన సిద్ధాంతానికి దేశవ్యాప్తంగా ఆమోదాన్ని పొందాలని భావించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే సోదిలో లేకుండా పోతామేమో అన్న భయాన్ని మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టుల్లో కలిగించారు. దీంతో మీడియా ఇప్పుడు మోడీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసే ప‌రిస్థితి లేకుండా పోయింది. అయితే.. వాస్త‌వాలు మాత్రం ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ఉంటాయా? అనేది విశ్లేష‌కుల మాట‌.

అయితే..క‌రోనా స‌మ‌యంలో మోడీ వ్య‌వ‌హ‌రించిన తీరు దేశ‌వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త‌ను పెంచేసింది. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ పేరుతో ఆయ‌న సాధించింది ఏమీ లేద‌న‌ని..ప్ర‌జ‌ల‌కు రుణాలు ఇచ్చే .. అప్పుల పాలు చేసేలా చేశార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ గాడి త‌ప్పింద‌ని అయినా.. దీనిని క‌నిక‌ట్టు చేసి.. చూపిస్తున్నార‌నేది నిపుణుల మాట‌. పైగా క‌రోనా తీవ్రంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఏమీలేద‌ని ప్ర‌చారం చేయ‌డంతోనే దేశంలో సెకండ్ వేవ్ వ‌చ్చింద‌నేది కూడా నిపుణ‌ల మాట‌. ఇలా.. మోడీపై పెరిగిన వ్య‌తిరేక‌త‌.. ప‌రోక్షంగా కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నేత‌, రాహుల్‌కు మేలు చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే రాహుల్‌కు ప్ర‌ధాని పీఠాన్ని పువ్వుల్లో పెట్టి అందించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.