Begin typing your search above and press return to search.
మీ క్రెడిట్ కార్డుతో రెంట్ కడుతున్నారా ? మిస్ కాకుండా చదవండి
By: Tupaki Desk | 22 Sep 2022 3:30 AMక్యాలెండర్ లో తేదీలు మారే కొద్దీ.. కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి బ్యాంకులు. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో కొత్త మార్పుల్ని తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. కొందరైతే నాలుగైదు కార్డులు ఉంచి.. ఒక కార్డుకు చెల్లించాల్సిన మొత్తాన్ని మరో కార్డుకు సంబంధించిన మొత్తాన్ని వాలెట్లలోకి ట్రాన్సఫర్ చేసి చెల్లింపులు జరపటం చూస్తుంటాం. ఇదంతా ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం.. వచ్చే ఆదాయానికి మించి ఖర్చులు చేయటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.
కొందరు క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లింపులు చేస్తుంటారు. రివార్డు పాయింట్లు.. క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో క్రెడిట్ కార్డును వీలైనంత ఎక్కువగా వినియోగించేలా చేయడం చాలామందిలో కనిపిస్తుంది. కానీ.. కొంతకాలానికి ఇదో అలవాటుగా మారి.. తర్వాతి కాలంలో వ్యసనంగా మారుతుంది. ఇలా.. కార్డులు గీకేసి.. తర్వాతి కాలంలో కార్డు చెల్లింపుల విషయంలో ఇబ్బందులకు గురి అవుతుంటారు.
అద్దె మొత్తాల్ని క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించేందుకు వీలుగా కొన్ని సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. పే మ్యాట్రిక్స్.. మ్యాజిక్ బ్రిక్స్.. ఫ్రీ ఛార్జ్.. రెడ్ జిరాఫీ.. నోబ్రోకర్ తో పాటు పేటీఎం.. ఫోన్ పే లాంటి సంస్థలు ఈ సేవల్ని షురూ చేశాయి. కార్డు ద్వారా అద్దె చెల్లింపులు జరిపినప్పుడు 0.2 శాతం నుంచి 2 శాతం వరకు సేవా రుసుము విధించేవారు. అంటే.. రూ.10వేల అద్దె అన్నప్పుడు రూ.200 మనం అదనంగా చెల్లించాల్సి ఉండేది. దీనికి తగ్గట్లు రివార్డు పాయింట్లు ఇస్తామన్న ఎర వేసేశారు.
అయితే.. తాజాగా క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లింపులు జరిపితే ఆ మొత్తం మీదా 1 శాతం సర్వీసు ఛార్జీ విధిస్తామని ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన అక్టోబరు 20 నుంచి అమల్లోకి రానుంది. అంటే.. కొత్త నిబంధన ప్రకారం పేటీఎం.. ఫోన్ పే లాంటి వాటికి చెల్లించే రుసుముతో పాటు..
బ్యాంకులకు 1 శాతం సర్వీస్ ఛార్జి.. దానికి జీఎస్టీ కూడా కలిపి వసూలు చేస్తారు. అంటే.. క్రెడిట్ కార్డులో అద్దెలు చెల్లించే పని మొదలు పెడితే తడిచి మోపెడు అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కొత్త విధానంలో వీలైనంతవరకు అద్దెలు కార్డు ద్వారా చెల్లింపులు జరపటం భారంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించాలి. అందుకు తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.