Begin typing your search above and press return to search.
కుక్కల్ని పెంచుతున్నారా? పన్నుకు రెఢీ కండి.. ఆ స్టేట్ లో షురూ!
By: Tupaki Desk | 15 Jan 2023 1:30 AM GMTమీ ఇంట్లో కుక్క ఉందా? మీకు కుక్కల్ని పెంచుకోవటం ఇష్టమా? అన్న ప్రశ్న రానున్న రోజుల్లో ప్రభుత్వాలకు కాసులు కురిపించే ప్రోగ్రాంగా మారనుంది. కుక్కల్ని పెంచుకుంటే.. అందుకు బదులుగా పన్నులు విధిస్తామంటూ అధికారులు చెప్పటాన్ని ఏమనాలి? ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది?
కారణం ఏదైతేనేం.. ఏదో రకంగా పన్ను విధించటం అన్నది ప్రభుత్వాలకు ఒక అలవాటుగా మారింది. రోజులు గడిచే కొద్దీ ప్రతి విషయం మీదా పన్నులు వేసే ప్రజా ప్రభుత్వాలకు ఒక అలవాటుగా మారింది. తమకు ఓట్లేసి చేతికి అధికారాన్ని ఇచ్చేది బాధ్యతగా పాలన చేయాలనే కానీ.. నెత్తి మీదకు ఎక్కి డ్యాన్సు వేయాలని ఎంత మాత్రం కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పట్టణానికి చెందిన మున్సిపాలిటీ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది.
మధ్యప్రదేశ్ లోని సాగర్ అనే పట్టణానికి చెందిన మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని తీసుకుంది.తాజాగా జరిగిన సమావేశాలో కుక్కల్ని పెంచే వారికి పన్ను విధించాలని.. ఇందుకు రానున్న ఏప్రిల్ ను ముహుర్తంగా పెట్టారు. ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా కార్పొరేషన్ తీసుకోవటం గమనార్హం. ఇలాంటి పన్ను విధిస్తున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలవనుంది. సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 48 మంది కార్పొరేటర్లు ఉంటే.. వారంతా మూకుమ్మడిగా పన్ను పోటుకు అనుకూలంగా నిలవటం గమనార్హం.
ఎందుకీ నిర్ణయాన్ని తీసుకున్నారన్నప్రశ్నకు వారు సమాధానం ఇస్తూ.. గడిచిన కొద్దికాలంగా పట్టణంలో పలు కుక్క దాడుల కేసులు పెరుగుతున్నాయని.. దీనికి తోడు పబ్లిక్ ప్లేసుల్లోకి వాటిని తీసుకొచ్చి టాయిలెట్ చేయించటం ద్వారా పరిసరాలు దెబ్బ తింటున్నాయన్న వాదనను వినిపించారు. ఈ పన్నుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ న్యాయ నిపుణుల సలహాకు పంపినట్లుచెబుతున్నారు.
అయితే.. ఈ నిర్ణయంపై విస్మయం వ్యక్తమువుతోంది. పలువురు కార్పొరేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ తగ్గదేలే అన్నట్లుగా సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహరిస్తోంది. తాము వేస్తున్నపన్ను ఆదాయం కోసం కాదని.. ప్రజల్లోజాగ్రత్తను పెంచటానికి అంటూ చెబుతున్న వ్యాఖ్యల్ని చూస్తే.. ఈ తరహా నిర్ణయాలపై ప్రజాగ్రహం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ పన్ను పోటు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియకుండా ఉంటే మంచిదని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.