Begin typing your search above and press return to search.

మీరు సున్నిత మనస్కులా? అయితే.. దీన్ని చదవకుండా ఉండటమే బెటర్

By:  Tupaki Desk   |   29 March 2022 4:29 AM GMT
మీరు సున్నిత మనస్కులా? అయితే.. దీన్ని చదవకుండా ఉండటమే బెటర్
X
ఇలాంటిది గతంలో చదివి ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు కొన్ని సైకో థ్రిల్లర్ సినిమాల్లో చూసి ఉండొచ్చు. ఇలాంటి వాటి గురించి విన్నంతనే మనసంతా చేదుగా మారిపోవటం.. ఈ దారుణానికి మెదడు మొద్దుబారిపోవటం.. కకావికలంగా మారటం లాంటివి అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. మరి.. అలాంటప్పుడు ఇలాంటి వాటిని ఎందుకు రాస్తారు? ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజెప్పకపోతే మీకు పోయేదేముంది? అని ప్రశ్నించొచ్చు.

కానీ.. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతటి దుర్మార్గులు ఉంటారన్న విషయంపై అవగాహన తేవటంతో పాటు.. ఇలాంటి వాటికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ తో పాటు.. పోలీసు ఇలాంటి నేరస్తుల విషయంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.

ఇంతకూ అసలేం జరిగిందన్న సందేహం కలుగుతుందా? అక్కడికే వస్తున్నాం. మహారాష్ట్రలోని నాసిక్ లో ఒక షాపు కొంతకాలంగా మూసి ఉంది.

కానీ.. ఆ షాపు నుంచి దుర్వాసన రావటం.. దాన్ని చుట్టు పక్కల వారు తట్టుకోలేకపోతున్న పరిస్థితి. దీంతో.. వారు తమకు ఎదురవుతున్న ఇబ్బందిని పోలీసులకు చెప్పుకున్నారు. దీంతో.. సదరు షాపు తాళాలు బద్ధలు కొట్టి తెరిసిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే సీన్ కనిపించింది. ఆ షాపులో మానవ మెదడు.. కళ్లు.. చెవులు.. ముఖంలోని కొన్ని అవయువాల్ని రెండు సంచుల్లో పెట్టినట్లుగా గుర్తించారు.

రెండు ప్లాస్టిక్ కవర్లలో దాచిన ఈ అవయువాల్ని పోలీసులు స్వాధీనం చేసుకొని.. తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ టీంకు అప్పజెప్పారు. ఇంతకూ ఈ అవయువాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నది ఒక ప్రశ్న అయితే.. ప్రాథమిక విచారణలో తేలిందేమంటే.. ఈ షాపు యజమాని ఇద్దరు కొడుకులు వైద్యులుగా గుర్తించారు.

ఎంత వైద్యులు అయితే మాత్రం షాపునకు మానవ అవయవాలు ఎలా తీసుకొచ్చి షాపులో ఉంచుతారు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఎవరినైనా హత్య చేసినా.. మరీ ఇంత దారుణంగా మానవ అవయవాలు ప్లాస్టిక్ కవర్లలో ఉంచటం ఏమిటన్నది సందేహంగా మారింది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతం వెనకున్న అసలు కథేమిటో పోలీసుల విచారణలో తేలనుంది.