Begin typing your search above and press return to search.

మాల్స్ లో షాపింగ్ చేస్తారా.. మీకిది షాకే

By:  Tupaki Desk   |   4 Jun 2020 3:30 AM GMT
మాల్స్ లో షాపింగ్ చేస్తారా.. మీకిది షాకే
X
లాక్ డౌన్ కార‌ణంగామూడు నెల‌లుగా మూత‌ప‌డి ఉన్నాయి షాపింగ్ మాల్స్. ఇలాంటి ప‌రిస్థితి ఇంత‌కుముందు ఎన్న‌డూ రాలేదు. దీని వ‌ల్ల బ‌ట్ట‌ల దుకాణాలు వేల కోట్ల‌ల్లో ఆదాయం కోల్పోయాయి. దుకాణాల్లో స్టాక్ పెద్ద ఎత్తున పేరుకు పోయి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ నెల 8 నుంచి దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ వ‌స్త్ర దుకాణాలు, మాల్స్ తెరుచుకోబోతున్నాయి. స్టాక్ పెద్ద ఎత్తున ఉండ‌గా.. దీనికి తోడు క‌స్ట‌మ‌ర్ల‌ను మ‌ళ్లీ దుకాణాల వైపు మ‌ళ్లించ‌డం కోసం పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఆఫ‌ర్లు పెడ‌తార‌నే అంచ‌నాల‌తో ఉన్నారంద‌రూ. కానీ అలాంటి ఆశ‌లేమీ పెట్టుకోవ‌ద్ద‌ని అంటున్నారు ఆ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు. ఈ స‌మ‌యంలో డిస్కౌంట్ ఆఫ‌ర్లు పెడితే ఒకేసారి జ‌నం పెద్ద ఎత్తున దుకాణాలకు వ‌స్తార‌ని.. కాబ‌ట్టి అలాంటి ఆఫ‌ర్లు ఏమీ పెట్టొద్ద‌ని ప్ర‌భుత్వం నుంచి మార్గ‌ద‌ర్శ‌కాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

నిజంగా అవసరం ఉన్నవారే మాల్స్‌కు రావాలనుకుంటున్నామ‌ని.. డిస్కౌంట్లు పెడితే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. భౌతిక దూరం పాటించ‌డంతో పాటు ఇత‌ర భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చూసుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని షాపింగ్ మాల్స్ యాజ‌మాన్యాలు అంటున్నాయి. ఈ స‌మ‌యంలో స్టాక్ అమ్ముడు బోవ‌డం కోసం ఆఫ‌ర్లు పెడితే జ‌నాల సంద‌డి పెరిగి మాల్స్ మూసేయాల‌న్న నిర్ణ‌యానికి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని.. కాబ‌ట్టి ఇప్పుడు ఆశకు పోవడం సరికాదని.. డిస్కౌంటు కంటే సురక్షితమైన షాపింగ్‌ అనుభవాన్నే వినియోగదారులకు కల్పించడ‌మే ముఖ్య‌మ‌ని భావిస్తున్నామ‌ని ఓ షాపింగ్ మాల్ చైన్ అధిప‌తి ఒక‌రు చెప్పారు. కాబ‌ట్టి క‌రోనా ప్ర‌బావం పూర్తిగా త‌గ్గాక త‌ప్ప డిస్కౌంట్ల గురించి వినియోగ‌దారులు ఆశించే ప‌రిస్థితి ఉండ‌దేమో.