Begin typing your search above and press return to search.
పొగ తాగుతున్నారా..? ఆ విషయంలోనూ మీకు నష్టమే..!
By: Tupaki Desk | 8 April 2021 11:30 PM GMTపొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్ని ప్రకటనలు చేసినా పొగరాయుళ్లలో ఏమాత్రం మార్పు రాదు. ధూమపానం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయరు. పొగ తాగడానికి ఎక్కువ ఖర్చు చేయాలి, ఆ తర్వాత అది చూపే దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి పెద్ద మొత్తంలోనే చెల్లించుకోవాల్సి ఉంటుంది. పొగరాయుళ్లకు ఇవే కాకాండా బీమా విషయంలోనూ చేదు వార్తే.
బీమా పాలసీలు కొనాలి అనుకుంటే పొగరాయుళ్లకు నష్టమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఒకవేళ టర్మ్ పాలసీలు కొనాలి అంటే ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా కొన్నిసార్లు జరిమానా కట్టాల్సి వస్తుందని అన్నారు. పొగతాగే వారిలో మరణాల రేటు అధికంగా ఉంటుంది కాబట్టి టర్మ్ పాలసీలకు ఎక్కువ మొత్తంలో చెల్లించాలనే నిబంధనను అమలు చేస్తున్నారు.
నిర్దిష్ట పరిమితికి మించి పాలసీలు ఎంచుకుంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆ పరీక్షల్లో నికోటిన్ వాడకాన్ని గుర్తించినట్లైతే యాభై శాతం ప్రీమియం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాలసీలు చేసే ముందు కచ్చితంగా ఈ విషయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఎందుకంటే నికోటిన్ వాడకాన్ని సులభంగా గుర్తించవచ్చు.
పాలసీ ఇచ్చే ముందు పాలసీదారుడు 12 నెలల నుంచి పొగాకు వాడుతున్నాడా? లేదా అనే పరీక్షలు చేయిస్తారని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య పరీక్షలను చేయించాల్సి ఉంటుంది. ఆ రిపోర్టుల్లో పోగాకు వాడుతున్న విషయం కచ్చితంగా బహిర్గతం అవుతుంది. పొగాకును సిగరెట్లు ఏవిధంగా తీసుకున్నా ధూమపానం కిందే జమ చేస్తారు.
బీమా క్లెయిమ్ చేసే ముందు నిజాలను చెప్పాల్సి ఉంటుంది. అసత్యాలను చెప్పడం వల్ల సెటిల్మెంట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తప్పుడు సమాచారం ఇస్తే మోసం చేసినట్లుగా పరిగణిస్తారు. అప్పుడు దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కచ్చితమైన, వాస్తవమైన సమాచారాన్నే పొందుపరచాలి. ఇక ప్రీమియం విషయంలో అధికంగా చెల్లించాల్సి వస్తుంది.