Begin typing your search above and press return to search.
కరోనా విముక్తి కోసం స్టెరాయిడ్ వాడుతున్నారా.. అయితే ప్రమాదమే!
By: Tupaki Desk | 14 May 2021 1:30 AM GMTకొవిడ్ ను ఎదుర్కొవడానికి స్టెరాయిడ్ బాగా పనిచేస్తుందని తేలింది. వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల వాళ్లు వైరస్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దేశంలో సెకండ్ వేవ్ ప్రభావంతో పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఇదే రీతిలో స్టెరాయిడ్స్ వాడకం పెరుగుతోంది. అది ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఇష్టానుసారంగా ఇవి వాడడం వల్ల ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. స్టెరాయిడ్లు ఎలా పనిచేస్తాయి? వాటి ప్రభావం ఎంత? ఎవరికి ఇవ్వాలి అనే అంశాలను దిల్లీకి చెందిన ప్రముఖ వైద్యులు వివరించారు.
ఇటీవల ఏమాత్రం కరోనా లక్షణాలు ఉన్నా నోటితో పీల్చుకునే స్టెరాయిడ్లను ఎక్కువ మంది వాడుతున్నారు. ఇవి మానవుడిలోని ఎడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే కార్టిసాల్ హార్మోన్ లాగా ఉంటుంది. ఇవి కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి దోహదపడుతాయి. కానీ వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే గుండె, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఇవి ప్రాణాంతకం కావొచ్చు అని అభిప్రాయ పడుతున్నారు.
స్టెరాయిడ్ల వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వైద్యుల సూచన మేరకు తక్కువ మోతాదులో వాడితే పర్లేదు కానీ ఇష్టానుసారంగా వాడితే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. నిద్రలేమి, షుగర్, బీపీ, ఆకలి పెరగడం, బరువు పెరగడం, గ్లకోమా, మానసిక సమస్యలు, ఇతర సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. వీటిని యాంటీబయాటిక్ తో కలిసి తీసుకుంటే పెను ప్రమాదంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు, చిన్నారులకు వీటిని వాడక పోవడమే మంచిదని అంటున్నారు. ఒక్కో కేసులో ఒక్కో రకంగా స్టెరాయిడ్ల అవసరం ఉంటుందని చెప్పారు.
వాస్తవానికి స్టెరాయిడ్లను కరోనా ముప్పు ఎక్కవ ఉన్నవారికే ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఏమాత్రం లక్షణాలు ఉన్నా వాడుతున్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ అధికంగా ఉంటేనే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆక్సిజన్ స్థాయి మెరుగ్గా ఉండి, జ్వరం, శ్వాస సంబంధ వ్యాధులు లేకపోతే వీటిని వాడకపోవడమే మంచిదని అంటున్నారు. కరోనా సోకి వారం గడిచినా జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తగ్గకపోతే వైద్యుల సూచనతో మూడు రోజుల పాటు ఈ కోర్సు వాడొచ్చు అని అంటున్నారు. అయిదు రోజులైనా కోలుకోలేకపోతే నోటితో పీల్చే బుడెసోనైడ్ వంటివి వాడాలని అంటున్నారు. సాధ్యమైనంత వరకు స్టెరాయిడ్లు వాడకపోతేనే మంచిదని అంటున్నారు. తప్పనిసరి అయితే వైద్యుల పర్యవేక్షణ అవసరం అని నొక్కి చెబుతున్నారు.