Begin typing your search above and press return to search.

టీకా వేయించుకుంటున్నారా? ఈ వార్త చదవటం మిస్ చేయొద్దు

By:  Tupaki Desk   |   20 Jun 2021 6:01 AM GMT
టీకా వేయించుకుంటున్నారా? ఈ వార్త చదవటం మిస్ చేయొద్దు
X
కొవిడ్ వేళ.. అందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాల్సిన పరిస్థితి. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా వేయించుకుంటున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నగర శివారులోచోటు చేసుకున్న వైనం తెలిస్తే షాక్ తినాల్సిందే. అంతేకాదు.. వ్యాక్సినేషన్ వేళ.. మరెంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.

టీకా వేసే వేళ.. ఫోన్ మాట్లాడుతూ రెండు డోసులు వేసిన నర్సు నిర్వాకం ఇప్పుడు ఒళ్లు జలరదించేలా చేస్తోంది. పెద్ద అంబర్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. టీకా వేయించుకోవటానికి 21 ఏళ్ల లక్ష్మీ ప్రసన్న అనే మహిళ వెళ్లారు. ఉదయం పదకొండు గంటల వేళలో టీకా వేయించుకోవటానికి వెళ్లిన ఆమెకు.. అక్కడే ఉన్న నర్సు పద్మ చేత టీకా వేయించుకున్నారు.

అదే సమయంలో నర్సుకు ఫోన్ వచ్చింది. దీంతో.. ఫోన్ మాట్లాడిన ఆమె పద్మను అక్కడే కూర్చోవాలని చెప్పారు. దీంతో.. కళ్లు మూసుకొని ఉన్న ఆమెకు.. ఫోన్ మాట్లాడుతున్న నర్సు పరధ్యానంగా పద్మకు మరో డోసు టీకా వేసేశారు. జరిగిందేమిటో అర్థమయ్యే లోపే ఆమెకు రెండో టీకా కూడా వేసేశారు. దీంతో.. ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది

పద్మకు రెండుసార్లు టీకా వేసినట్లుగా ఆందోళన వ్యక్తం కావటంతో..ఆమెకు ప్రధమచికిత్స చేసి.. మరో ఇంజెక్షన్ చేసి.. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండురోజుల పాటు ఆమెకు ప్రత్యేక గదిలో ఉంచి పరిశీలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆమెను ఇంటికి పంపారు.
ఫోన్ మాట్లాడుతూ తనకు రెండు డోసులు వేసినట్లుగా పద్మ ఆరోపిస్తుంటే.. అక్కడి అధికారులు మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. సిరంజిలోకి మందు లోడ్ చేసిన సమయంలో నర్సుకు ఫోన్ వచ్చిందని.. ఆమె టీకా వేయలేదని.. ఫోన్ మాట్లాడాక టీకా వేశారని చెబుతున్నారు. మొత్తంగా రెండు డోసులు వేసినట్లుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఏది ఏమైనా..టీకా వేయించుకునే వేళలో మరింత అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.