Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరు తమ్ముళ్లు కారు ఎక్కేసినట్లేనా..?
By: Tupaki Desk | 8 March 2016 4:48 AM GMTతెలంగాణ అధికారపక్షానికి చెందిన నేత ఒకరు రీసెంట్ గా మాట్లాడుతూ.. టీటీడీపీలో మిగిలేది రేవంత్ రెడ్డి ఒక్కరే అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. నిజానికి ఈ మాటేమీ కొత్తేం కాదు. కాకుంటే.. రేవంత్ తో పాటు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర కూడా ఉంటారని బలంగా నమ్మేవాళ్లు. దానికి భిన్నంగా టీఆర్ ఎస్ కీలక నేత సండ్ర కూడా కారు ఎక్కటం ఖాయమన్న మాటను నర్మగర్భంగా చెప్పుకొచ్చారు.
ఇలాంటి వ్యాఖ్య వచ్చిన 48 గంటల వ్యవధిలోనూ కీలక పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. టీటీడీపీకి చెందిన దివంగత మాధవరెడ్డి నివాళులు అర్పించేందుకు టీటీడీపీ నేతలతో సమావేశమయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సందర్భంగా ఆయనో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే లు.. ముఖ్యనేతలకు ఆహ్వానాలు పంపారు.
షాకింగ్ గా.. ఈ సమావేశానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లు గైర్హాజరు కావటం సంచలనంగా మారింది. సీఎం స్వయంగా సమావేశానికి వస్తున్న విషయాన్ని వారికి పర్సనల్ గా చెప్పినా.. వారిద్దరూ అబ్సెంట్ కావటం చూస్తే.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం ఇప్పుడే కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని చెప్పక తప్పదు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు కసరత్తు మొత్తం పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. వాటిని ఎప్పటికప్పుడు ఆ ఇద్దరు నేతలు ఖండించటం తెలిసిందే. తాజాగా బాబుతో భేటీకి గైర్హాజరు కావటం ద్వారా అరికేపూడి.. మాగంటిలు ఇద్దరూ కారు ఎక్కేందుకు గ్రౌండ్ మొత్తం క్లియర్ అయినట్లుగా చెబుతున్నారు. జోరుగా అంచనాలు సాగుతున్నది సరే.. మరి.. వాస్తవ రూపం దాల్చేదెప్పుడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.