Begin typing your search above and press return to search.
11వ తేదీ ఉదయం 11 గంటలకు ఏమవుతుంది?
By: Tupaki Desk | 8 March 2016 5:51 PM GMTరాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ ఇప్పుడు నడుస్తోంది. మరో మూడు రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరగనుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే పలువురు కారు ఎక్కేయటం తెలిసిందే. ఇక.. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో.. కృష్ణయ్య పార్టీతో సంబంధం లేనట్లుగా ఉన్నారు. ఇక.. మిగిలిన నలుగురిలో ఇద్దరు (మాగంటి గోపీనాథ్.. ఆరెకపూడి గాంధీ) కారు ఎక్కేయటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.
నిజానికి వీరిద్దరూ తెలంగాణ అధికారపక్షంలో చేరటం ఖాయమన్న మాట కొద్దిరోజలుగా వినిపిస్తున్నప్పటికీ.. ఎప్పటికప్పుడు వాయిదాలు పడటం.. తాము పార్టీలోనే ఉంటామని చెప్పటం లాంటివి జరిగాయి. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాజాగా జరిగిన భేటీతో వీరిద్దరి పోక ఖాయమని తేలిపోయింది. సైకిల్ ను విడిచి పెట్టి.. కారు ఎక్కేందుకు ముహుర్తం కూడా సిద్ధమైనట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఈ ఇద్దరు తెలంగాణ తమ్ముళ్లు కారు ఎక్కేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవటం ఖాయంగా మారింది. ఈ పరిణామంతో.. టీటీడీపీలో ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పడిపోనుంది.