Begin typing your search above and press return to search.
మరో టీడీపీ ఎమ్మెల్యే వికెట్ డౌన్
By: Tupaki Desk | 18 Dec 2015 6:43 AM GMTగ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించేవరకు తెరాస నాయకులు నిద్రపోయేటట్టు లేరు. నయానో...భయానో ఇతర పార్టీలకు చెందిన నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఏదోలా బలవంతంగా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. గ్రేటర్ లో ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గులాబి గూటికి చేరిపోయారు. అయితే ఇప్పుడు మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు తెరాసలో చేరిన వారిది ఒక స్టోరీ అయితే...తాజాగా కారెక్కేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేది మరో స్టోరీ. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా...గ్రేటర్ లోని శేరిలింగంపల్లికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.
గాంధీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. గత ఎన్నికల్లోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గాంధీని కారెక్కించేందుకు గత మూడు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రి హరీష్ రావు ఆయన మీద బాగా ఒత్తిడి తేవడంతో ఆయన కూడా తెరాసలో చేరతానని మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాను ఎప్పుడు పార్టీ మారేది స్పష్టం చేయకపోవడంతో హరీష్ మాత్రం పట్టు వదలకుండా తొందరగా పార్టీలోకి వచ్చేయాలని పదే పదే ఒత్తిడి చేస్తున్నారట.
మీ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇస్తాం. అధికార పార్టీలో ఉంటే పనులు ఎలా చేసుకోవచ్చో మీకు తెలియదా? టీడీపీలో ఉంటే మీకు నష్టమే..మిమ్నలను నమ్మకున్న కార్యకర్తలకు కూడా నష్టమే అని అని హరీష్ గాంధీతో అన్నట్టు సమాచారం. తానే స్వయంగా మీ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని కూడా హరీష్ గాంధీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే గాంధీ సామాజికవర్గానికే చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కూడా ఆయనపై ఒత్తిడి చేయిస్తున్నారట. ఏదేమైనా ఫైనల్ గా గాంధీ మాత్రం గులాబి బుట్టలో పడినట్టే కనిపిస్తోంది.
గాంధీ కూడా తెరాసలో చేరిపోతే ఇక గ్రేటర్ లో ముగ్గురు ఎమ్మెల్యే లు మాత్రమే టీడీపీకి ఉంటారు. వీరిలో గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు - జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ - రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉంటారు. వీరిలో ప్రకాష్ గౌడ్ కూడా ఎప్పుడు పార్టీ మారదామా అన్న ఊగిసలాటలో కనిపిస్తున్నారు. ఇక వివేక్ తో హరీష్ చర్చలు విఫలమవడంతో ఆయన పార్టీ మారడం కష్టమే అనుకోవాలి. ఏదేమైనా గాంధీ కూడా నేడో...రేపో పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ నుంచి మరో ఎమ్మెల్యే వికెట్ డౌన్ అయినట్టే అనుకోవాలి.