Begin typing your search above and press return to search.
పార్లమెంట్ లోనే దుకాణం పెట్టాడుగా.. రొమాన్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎంపీ
By: Tupaki Desk | 26 Sep 2020 11:30 PM GMTఆయనో ప్రజాప్రతినిధి.. తమ సమస్యలు పరిష్కరిస్తాడని .. తమ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాడని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ సదరు నేత సభ్యసమాజం తలదించుకొనే పనిచేశాడు. ఏకంగా పార్లమెంట్లో అందరూ చూస్తుండగానే తన సెక్రటరీని ముద్దుపెట్టుకుంటూ రొమాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం సదరు ఎంపీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. యువతి టీ షర్టును కిందికి లాగి మరీ ముద్దాడాడు. ఇదంతా లైవ్ టెలీకాస్ట్ కావడంతో చివరకు తన ఎంపీ పదవి ఊడింది. ఈ ఘటన ఇటీవల అర్జెంటీనా దేశంలో జరగగా .. ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది.
కరోనా మహమ్మారిని ఎలా అరికట్టాలనే విషయం చర్చించేందుకు అర్జెంటీనాలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సభలో చర్చ జరుగుతోంది. ఎంపీలంతా ఎంతో ఆసక్తిగా చర్చను వింటున్నారు. ఈక్రమంలో అధికార పార్టీ పెరోనిస్ట్కు చెందిన ఎంపీ ఎమిలియో అమేరి ఓ యువతితో సరసాలు ఆడాడు. ఆన్లైన్లో ఈ చర్చను అందరూ వింటున్నారన్న సోయి లేకుండా ఆయన రెచ్చిపోయాడు.
మహిళ ఎదను ముద్దుపెట్టుకుంటూ విచక్షణ కోల్పోయాడు. ఈ విషయాన్ని గమనించిన హౌస్ అధ్యక్షుడు సెర్జీయో మస్సా షాక్ అయ్యాడు. వెంటనే అమెరీని హౌస్ నుంచి సస్పెండ్ చేశాడు.
దీనిపై సెర్జీయో స్పందిస్తూ ‘ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య. ప్రజలకు సంబంధించిన ప్రతినిధులుగా హుందాగా వ్యవహరించవలసిన మనం ఇంతకు దిగజారితే ఇక ప్రజలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటారు. నేను అమేరిని వెంటనే హౌస్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఈ విషయంపై విచారించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమిస్తున్నాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్జియో నిర్ణయంతో హౌస్సభ్యులంతా ఏకీభవించారు. అతడని సస్పెండ్ చేసేందుకు పూర్తిమద్దతు తెలిపారు. అయితే సదరు ఎంపీ రొమాన్స్ చేసింది తన దగ్గర పనిచేసే రాజకీయ సలహాదారుతోనే అని సమాచారం. ఎంపీ అమేరి కొంత కాలం క్రితం తన భార్యతో విడిపోయాడు. అనంతరం ఈమెను రాజకీయసలహాదారుడిగా నియమించుకున్నారు. అయితే ఈ విషయంపై అమేరి మీడియాతో మాట్లాడాడు. ‘ నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. ఆ సమయంలో ఇంటర్నెట్ పోయిందని భావించి నేను ఆ పనికి పూనుకున్నాను. కానీ దురదృష్టవశాతు కరెంట్ రావడంతో నేను దొరికిపోయాను. ఏ శిక్ష విధించినా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అంటూ స్పందించాడు. ఏది ఏమైనా అమేరి చేసిన పనికి నెటిజన్లు తీవ్రంగా మండిపడతున్నారు.