Begin typing your search above and press return to search.
కోర్టులో వాదనలు.. విసుర్లే కాదు జోకులు కూడా!
By: Tupaki Desk | 27 Jun 2015 7:21 AM GMTసినిమాల్లో చూపించే కోర్టు సీన్లు తప్పించి.. కోర్టుకు వెళ్లే సామాన్యులు చాలా తక్కువ మందే. పోలీస్‌స్టేషన్.. కోర్టుకు వెళ్లటానికి నామోషీగా భావించే వారు చాలామంది ఉంటారు. మరికొందరిలో ఇవంటేనే భయం.. భక్తి కనిపిస్తాయి.
నిజానికి కోర్టుల్లో ప్రజలకు ఉండే అభిప్రాయనికి పూర్తి భిన్నంగా సాగుతుంటాయి. సినిమాల్లో చూపించిన తీరులో వాదనలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక.. ఒక పెద్ద కేసును రెండు వాయిదాల్లో.. నాలుగు రోజుల్లో పూర్తి చేసే ధోరణి కూడా కనిపిస్తుంది.. వాస్తవంలో ఇలాంటివేమీ ఉండవు.
సహజంగా కోర్టు అనగానే మీడియాలో సైతం.. తీవ్రస్థాయిల వాదోపవాదాలు.. న్యాయమూర్తుల విసుర్లు మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. న్యాయమూర్తుల సెన్సాఫ్ హ్యూమర్.. పంచ్‌లు పెద్దగా కవర్ చేయవు. పెద్దపెద్ద కేసుల్లో ఇలాంటి అంశాలు అరుదుగా బయటకు వచ్చి పలువుర్ని ఆకర్షిస్తాయి.
తాజాగా ఓటుకు నోటు కేసులో బెయిల్ కోసం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో దరఖాస్తు చేసుకోవటం.. దీనిపై శుక్రవారం తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరగటం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో నవ్వులు పూయించాయి.
బెయిల్ ఇవ్వకూడదన్న విషయాన్ని చెప్పే క్రమంలో ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయం తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలో కల్పించుకున్న న్యాయమూర్తి.. డబ్బు ఆర్‌బీఐ నుంచే కదా వచ్చేదనటంతో కోర్టు హాలులో నవ్వులు విరబూశాయి. మరో సందర్భంలో.. రేవంత్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదన్న విషయాన్ని వివరిస్తూ.. మొదట రూ.2కోట్లు ఇస్తామని చెప్పి తర్వాత రూ.5కోట్లు బేరం కుదుర్చుకున్నట్లుగా చెప్పగా.. బేరం ఆడే సంప్రదింపుల్లో తగ్గాలే కానీ పెరగటం ఏమిటి? అని ప్రశ్నించటంతో కోర్టు హాలులో అప్పటివరకూ ఉన్న గంభీరత స్థానే నవ్వులు విరిసాయి. మొత్తంగా కోర్టులో వాడీవేడీగా తీవ్రస్థాయిలో జరిగే వాదనల స్థానంలో.. మధ్య మధ్యలో చమక్కులు పలువురిని ఆకర్షించాయి.