Begin typing your search above and press return to search.
సచిన్ కొడుక్కి ఊతకర్ర ఎందుకొచ్చింది?
By: Tupaki Desk | 13 May 2017 4:59 AM GMTక్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కుర్రాడికి ఉన్నట్లుండి ఊతకర్ర (క్రచెస్) పట్టుకొని బయటకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్న సందేహం పట్టి పీడిస్తోంది. ప్రపంచ రాక్ సంచలనం.. ప్రఖ్యాత పాప్ స్టార్ జస్టిన్ బీబర్ కన్సర్ట్ ముంబయిలో జరిగిన సంగతి తెలిసిందే.
అతగాడి కార్యక్రమానికి యూత్ వేలం వెర్రిగా వెళ్లిన వైనాన్ని చూశాం. అలా వెళ్లిన వారిలో క్రికెట్ దేవుడు సచిన్ కుమారుడు అర్జున్ కూడా ఉన్నాడు. నిజానికి ప్రముఖ సెలబ్రిటీలు.. వారికి సంబంధించిన వారు సగటు అభిమానుల తరహాలోనే బీబర్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. అయితే.. మిగిలిన వారికి భిన్నంగా సచిన్ కుమారుడు ఊతకర్రల సాయంతో కార్యక్రమానికి హాజరు కావటం షాకింగ్ గా మారింది.
నిన్నమొన్నటి వరకూ అర్జున్ బాగానే ఉన్నప్పటికీ.. ఉన్నట్లుండి ఊతకర్రలు అర్జున్ కు ఎలా వచ్చాయన్న సందేహం ఇప్పుడు పట్టి పీడిస్తోంది. ఆయన ఎడమ కాలుకు బ్యాండేజ్ ఉండటం.. రెండు ఊత కర్రల సాయంతో నెమ్మదిగా కార్యక్రమానికి నడుచుకుంటూ వెళ్లటం కనిపించింది. అర్జున్ కు ఏమైందన్న ఆందోళన.. వాకబు సోషల్ మీడియాలో పెరుగుతోంది. బీబర్ ను విపరీతంగా అభిమానించే అర్జున్ ను చాలామంది దేశీ బీబర్ గా అభివర్ణిస్తుంటారు. ఈ కారణంతోనే కాలికి గాయమైనా.. ఊతకర్రల్ని సాయంగా చేసుకొని ప్రోగ్రాంకు రావటం ద్వారా.. బీబర్ అంటే తనకెంత అభిమానమన్న విషయాన్ని తన రాకతో చెప్పకనే చెప్పేశాడు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇంతకీ.. అర్జున్ టెండూల్కర్ కాళ్లకు ఏమైనట్లు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/