Begin typing your search above and press return to search.

అర్జున్‌ ‌ బౌలింగ్‌ ను ఎదుర్కొవడం చాలా కష్టం : డానియల్‌

By:  Tupaki Desk   |   17 Jun 2020 8:30 AM GMT
అర్జున్‌ ‌ బౌలింగ్‌ ను ఎదుర్కొవడం చాలా కష్టం : డానియల్‌
X
క్రికెట్ గాడ్ సచ్చిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ కోసం గత కొన్ని రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాదిలో ఎక్కువ నెలలు ఇంగ్లండ్ ‌లో గడుపుతూ క్రికెట్ లో నిష్ణాతుడు కావడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఆదేశ క్రికెటర్లతో నెట్స్‌ లో ప్రాక్టీస్‌ చేస్తూ రోజురోజుకి ఆటలో పరిణితి చెందుతున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుతోనూ అర్జున్‌ ప్రాక్టీస్‌ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి.

ఇక ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌ డానియల్‌ వ్యాట్‌, అర్జున టెండూల్కర్‌లు మంచి స్నేహితులు అనే విషయం అందిరికీ తెలిసిందే. అయితే అర్జున్‌ బౌలింగ్‌ గురించి వ్యాట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్‌ టెండూల్కర్‌ బౌలింగ్‌ ను ఎదుర్కొవడం చాలా కష్టమని ‌ డానియల్‌ వ్యాట్‌ చెప్పింది. ‘అర్జున్‌ - నేను మంచి స్నేహితులం. లార్డ్స్‌ మైదానానికి ప్రాక్టీస్‌ చేయడానికి అతడు వస్తుండేవాడు. అప్పుడు కొత్త బంతితో నాకు బౌలింగ్‌ చేయాలని అడిగితే అర్జున్‌ భయపెట్టేవాడు. నేను వేసే బౌన్సర్లు నీ తలకు తగులుతాయి అని హెచ్చరించేవాడు.

దీంతో అతడి బౌలింగ్‌ లో బ్యాటింగ్‌ చేసేందుకు ఇష్టపడను. అంతేకాకుండా అతడి బౌలింగ్‌ ను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆటగాడిగా మెరుగవుతున్నాడు. త్వరలోనే అంతర్జాతయ క్రికెట్‌ లో అతడిని చూసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అర్జున్‌ వాళ్ల అమ్మ అంజలితో తరుచూ మాట్లాడతా. చాలా మంచి వ్యక్తి. సచిన్‌ - అంజలిలు ఇంగ్లండ్‌ కు వచ్చిన ప్రతీసారి వారిని కలుస్తాను’ అని డానియల్‌ వ్యాట్‌ వ్యాఖ్యానించారు. ఇక మహిళల ప్రపంచకప్‌ -2017 గెలిచిన ఇంగ్లండ్‌ జట్టలో వ్యాట్‌ కీలక ప్లేయర్‌ అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ తరుపును ఆమె ఇప్పటివరకు 74 వన్డేలు - 109 టీ20లకు ప్రాతినిథ్యం వహించారు.