Begin typing your search above and press return to search.
పోలీసుల్లా వచ్చి జైలు మీద దాడి చేశారు
By: Tupaki Desk | 27 Nov 2016 7:31 AM GMTమరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్ యాక్షన్ సినిమాల్ని తలపించే సన్నివేశం.. తాజాగా పంజాబ్ లో చోటు చేసుకుంది. జైల్లో ఉన్న తీవ్రవాద నాయకుడ్ని తీసుకెళ్లేందుకు ఏకంగా జైలు మీద దాడి చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. మొన్నటికి మొన్న భోఫాల్ సెంట్రల్ జైలులోని ఖైదీలు గార్డును హతమార్చి మరి జైలు నుంచి పారిపోవటం.. ఆపై వారంతా ఎన్ కౌంటర్ కావటం తెలిసిందే.
ఈ ఘటనను మర్చిపోక ముందే.. ఊహించని పరిణామం పంజాబ్ లోని నబాలో చోటు చేసుకుంది. పదిమంది సాయుధులైన దుండగులు పోలీసు దుస్తుల్లో వచ్చి నభా జైలుపై దాడి చేశారు. అనంతరం జైల్లో ఉన్న ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ తో పాటు మరో నలుగురిని విడిపించుకు వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది.
హర్మీందర్ సింగ్ తో పాటు జైలు నుంచి తప్పించుకున్న వారిలో గుర్ ప్రీత్ సింగ్.. విక్కీ గోండ్రా.. నితిన్ డియోల్.. విక్రమ్ జీత్ సింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఖలిస్థాన్ చీఫ్ ను విడిపించేందుకే ఇంత భారీ స్కెచ్ వేసిన దుండగుల్ని.. జైలు నుంచి తప్పించుకున్న మిలిటెంట్లను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ లో అల్లకల్లోం చేసేందుకు తీవ్రవాద సంస్థలతో విదేశాల్లో హర్మిందర్ సింగ్ శిక్షణ పొందినట్లుగా చెబుతారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/