Begin typing your search above and press return to search.
బిపిన్ రావత్ దుర్మరణం.. ప్రకటించిన వాయుసేన
By: Tupaki Desk | 8 Dec 2021 12:30 PM GMTభారత త్రివిధ దళాల తొలి అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ -సీడీఎఫ్) బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులు దుర్మరణం పాలైనట్లు వాయుసేన తాజాగా ప్రకటించింది.
భారత సైనిక చరిత్రలో అతి పెద్ద ప్రమాదం.. 14 మందిలో 13 మంది దుర్మరణం
భారత త్రివిధ దళాల తొలి అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ -సీడీఎఫ్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ17 వీఎఫ్ హెలికాప్టర్ కూలిన ఘటనలో మొత్తం 13 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో ఎవరి శరీరం ఎవరిదో గుర్తించేందుకు చాలా కష్టం అవుతోంది. దీంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా డెడ్ బాడీలు ఎవరివో తేల్చనున్నారు. కాగా, ప్రయాణ సమయంలో హెలికాప్టర్ లో14 మంది ఉన్నారు. జీవించి ఉన్న ఆ ఒక్కరూ సీడీఎఫ్ బిపిన్ రావత్ అని తెలుస్తోంది. రావత్ ను పోలీసులు దుప్పటిలో ఉంచి తీసుకెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో ప్రకారం చూస్తే రావత్ తీవ్రంగా గాయాలపాలై ఉన్నారు. అంతేకాక ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ప్రత్యక్ష సాక్షి ఒకరు వివరాలు చెబుతున్న వీడియో కూడా మీడియాలో ప్రసారమవుతోంది. మరోవైపు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ సాయంత్రం భేటీ కానుంది.
ఇదీ ఎంఐ17వీ5 హెలికాప్టర్ ప్రత్యేకత
బిపిన్ రావత్ స్థాయి అధికారి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడాన్ని బట్టి చూస్తే ఇది భారత సైనిక చరిత్రలోనే అతి పెద్ద దుర్ఘటనగా భావిస్తున్నారు. అంతేకాక ఎంఐ17వీ5 హెలికాప్టర్ వీవీఐపీలు ప్రయాణించేంది. రష్యాలో తయారైన ఈ హెలికాప్టర్ సైనిక రవాణా విమానం. ఆయుధ సహితంగా ఉంటుంది. 1975లో తొలిసారిగా తయారు చేశారు. భారత్ వీటిని 2008లో కొనుగోలు చేసింది. 2011 లో సైన్యానికి అప్పగించింది. ప్రపంచంలో అత్యంత అధునాతన మిలటరీ ట్రాన్స్ పోర్ట్ హెలికాప్టర్ ఇది. 60 పైగా దేశాలు వీటిని వినియోగిస్తున్నాయి. సైనికులనే కాక ఆయుధాలనూ దీనిద్వారా సరఫరా చేయొచ్చు. ఫైర్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాన్వాయ్ ఎస్కార్ట్ లో పెట్రోలింగ్ లో, సెర్చ్ ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తుంటారు.
పొగ మంచే ముంచిందా?
ఈ దుర్ఘటనకు పొగమంచే కారణమని భావిస్తున్నారు. శీతాకాలం కావడానికి తోడు వాతావరణం అనూహ్యంగా మారిపోయే కొండ ప్రాంతాల్లో ప్రయాణం కావడంతో పొగ మంచు దెబ్బతీసింది. ప్రమాదంలో కుట్ర లేదని తెలుస్తున్నది. పైలట్లు అత్యంత సుశిక్షితులని... భద్రత రీత్యా అత్యంత జాగ్రత్తగా ఉంటారని చెబుతున్నారు. మరోవైపు హెలికాప్టర్ నిర్జన ప్రదేశంలో కూలింది. జనావాసాల మధ్య కూలి ఉంటే ప్రాణ నష్టం తీవ్రంగా ఉండేది.