Begin typing your search above and press return to search.
ఆ జవాను ఇప్పుడు దీక్ష చేస్తున్నాడు
By: Tupaki Desk | 15 Jan 2017 7:56 AM GMTవిధి నిర్వహణే తప్పించి మరేమీ పట్టించుకోకుండా పోతున్న జవాన్లు.. తమపై అధికారుల తీరును వీడియోలతో ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తున్న విషయం తెలిసిందే. సరిహద్దుల దగ్గర ప్రకృతి ప్రతికూల పరిస్థితుల్నితట్టుకుంటూ.. శత్రు దేశం చేసే దుర్మార్గాల్ని అడ్డుకుంటూ.. అవసరమైతే ప్రాణ త్యాగం చేసే సైనికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయం తాజాగా విడుదలైన సైనికుడి వీడియో చెప్పేసింది.
సైనికుల్లోని ఆత్మస్థైర్యాన్ని బయట శత్రువే కాదు.. లోపలి శక్తులు కూడా శత్రువులుగా మారుతున్నాయని.. కడుపు నిండా సరైన తిండి తినలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారన్న పచ్చి నిజాన్ని వీడియోతో పోస్ట్ చేసిన ప్రతాప్ సింగ్ పుణ్యమా అని ఉన్నతాధికారుల ఆరాచకాలు ఎలా ఉంటాయన్న విషయం అందరికి అర్థమయ్యయని చెప్పాలి. దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు పెట్టే తిండి విషయంలో నడుస్తున్న అవినీతి సంగతి కూడా చూడాలంటూ పాలకులకు అర్థమయ్యేలా చేయటంలో ప్రతాప్ సింగ్ సక్సెస్ అయ్యారు.
ఆయన విడుదల చేసిన వీడియో రేపిన సంచలనం చల్లారక ముందే.. జవాన్లు ఉన్నతాధికారుల వ్యక్తిగత పనుల కోసం ఎంతగా శ్రమిస్తున్నారన్న విషయం తెలిసేలా ప్రతాప్ సింగ్ విడుదల చేసిన మరోవీడియో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతాకాదు. దేశానికి సేవ చేసేందుకు సైన్యంలో చేరిన ప్రతాప్ సింగ్.. ఉన్నతాధికారుల తీరుపై తీవ్రంగా వేదన చెందుతున్నారని చెబుతున్నారు ప్రతాప్ సింగ్ సతీమణి రిచా సింగ్. సైనికులకు న్యాయం చేయాలంటూ తన భర్త నిరాహార దీక్షచేస్తున్నట్లు మీడియాకు చెప్పారు.
15 ఏళ్లుగా సైన్యంలో ఉన్న ప్రతాప్ సింగ్.. సైనికులకు జరుగుతున్న ఇబ్బందులు.. సమస్యలకు సంబంధించి గత ఏడాది రాష్ట్రపతి.. సుప్రీంకోర్టు.. ప్రధాని.. రక్షణ శాఖ మంత్రికి లేఖలు రాశానని.. సమస్యలకు పరిష్కారం లభించకపోగా.. వేధింపులు మరింత పెరిగినట్లుగా పేర్కొంటూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో.. వీడియోలో జవానుల దుస్థితి గురించి వెల్లడించిన ప్రతాప్ సింగ్ ప్రస్తుతం దీక్ష చేస్తున్న వైనం చూస్తుంటే.. సైనికుల సమస్యలపై ప్రధాని అర్జెంట్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న భావన కలగటం ఖాయం. సమంజసంగా ఉండే ప్రతి ఒక్క లేఖకు స్పందిస్తారన్నట్లుగా బయటకు వచ్చే ఉదంతాలు చూసినప్పుడు.. జవాను లేఖకు మోడీ ఎందుకు జవాబు ఇవ్వనట్లు..?