Begin typing your search above and press return to search.
దాయాది దుర్మార్గం.. మన సైన్యాధికారి మృతి
By: Tupaki Desk | 26 Dec 2019 4:37 AM GMTకాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్థాన్ దుర్మార్గానికి తాజాగా ఒక సైన్యాధికారి మృతి చెందారు. కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ఎప్పటికప్పుడు కాల్పులతో తెగబడే పాకిస్థాన్.. తాజాగా మరోసారి అలాంటి తీరునే ప్రదర్శించింది.
నియంత్రణ రేఖ వెంట ఉన్న గ్రామాల్ని లక్ష్యంగా చేసుకున్న పాకిస్థాన్ కాల్పులకు తెగబడింది. దీనికి భారత దళాలు ధీటుగా స్పందించాయి. అయితే.. ఈ ఘటనలో ఒక సైన్యాధికారితో పాటు ఒక మహిళ మృతి చెందారు. ఉరి గ్రామంలో హజిపీర్ ప్రాంతంలో బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి.
ఇదే రీతిలో మంగళవారం రాత్రి కూడా అంతర్జాతీయ సరిహద్దున ఉండే గ్రామాల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. అప్పుడు కూడా భారత్ దళాలు ధీటుగా స్పందించి కాల్పులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాయి. అయితే.. సైన్యానికి చెందిన అధికారి.. ఒక సాధారణ మహిళ మృతి చెందడంతో విషాద వాతావరణం నెలకొంది. కయ్యానికి కాలుదువ్వే పాక్ కు ఘాటైన సమాధానం చెప్పాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.