Begin typing your search above and press return to search.
సైన్యం పుణ్యమా అని ఢిల్లీకి గ్రేట్ రిలీఫ్
By: Tupaki Desk | 22 Feb 2016 7:01 AM GMTపేరుకు మహానగరమైనా వాడుకునేందుకు చుక్కనీరు లేకపోతే పరిస్థితి ఏమిటి? ఊహించటానికే కష్టంగా ఉన్నా ఇది నిజం. దేశ రాజధాని ఢిల్లీలో నీటి కోసం కటకటలాడిపోతూ.. స్వయంగా సీఎమ్మే నీటి కటకట గురించి ట్వీట్ చేసిన దుస్థితి. నీటి ఇబ్బంది మీద ముఖ్యమంత్రే అంతగా ఆందోళనపడితే.. వాస్తవ పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు.
హర్యానాలో చోటు చేసుకున్న జాట్ ఉద్యమంలో భాగంగా ఢిల్లీకి నీటి సరఫరాకు కీలకమైన మునాక్ కాలువను ఆందోళనకారులు తమ అధీనంలోకి తీసుకుని... నీటిని ఢిల్లీకి రాకుండా చేశారు. దీంతో.. ఢిల్లీకి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ కారణం చేతనే.. సోమవారం ఢిల్లీలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
తాజాగా సైన్యం కాలువను తమ అధీనంలోకి తీసుకుందని.. మునాక్ కాలువ గేట్లు తెరుచుకున్నాయని.. ఢిల్లీకి నీళ్లు ఎంతసేపట్లో వస్తాయన్న విషయాన్ని తాను ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తానంటూ సీఎం కేజ్రీవాల్ తన తాజా ట్వీట్ లో వెల్లడించారు. సైన్యం కారణంగా ఢిల్లీకి గ్రేట్ రిలీఫ్ అని చెప్పక తప్పదు. లేకుంటే.. మహానగరం నీళ్ల కోసం దారుణ ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చేది.