Begin typing your search above and press return to search.
తీర్పు చెప్పిన ఆర్నాబ్ కు పంచ్ తప్పలేదు
By: Tupaki Desk | 30 May 2017 7:24 AM GMTశక్తివంతమైన ఆయుధం చేతిలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఉన్న ఆయుధాన్ని ఎట్లా పడితే అలా ఉపయోగిస్తే.. మొదటికే మోసం రావొచ్చు. కానీ.. పవర్ చేతిలో ఉన్నప్పుడు ఇలాంటి విచక్షణను కొందరు ప్రముఖులు మిస్ అయి లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటుంటారు.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మీడియా ప్రముఖుడు.. రిపబ్లిక్ టీవీతో రీఎంట్రీ ఇచ్చిన ఆర్నాబ్ గోస్వామి. గతంలో టైమ్స్ నౌ ఛానల్లో చెలరేగిపోయిన ఆయన.. తర్వాత సొంతకుంపటిని రిపబ్లిక్ పేరుతో పెట్టుకోవటం తెలిసిందే.
ఛానల్ లైవ్ లోకి వచ్చేసిన తర్వాత.. సంచలన కథనాన్ని టెలికాస్ట్ చేయటం ద్వారా ఒక్కసారి ఛానల్ ను పాపులర్ చేయాలని అనుకున్నారో ఏమో కానీ.. మాజీకేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి అంశాన్ని టేకప్ చేశారు. ఇష్యూలను టేకప్ చేయటం ఓకే కానీ.. దాన్ని జడ్జి చేయటంలోనే కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కానీ.. కొత్త ఉత్సాహంతో ఉన్న అర్నాబ్.. సునందపుష్కర్ ఇష్యూలో తనదైన శైలిలో జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఆమె మృతికి సంబంధించి శశిథరూర్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ తీరుపై మీడియా వర్గాల్లో హాట్ హాట్ గా చర్చలు సాగాయి. కోర్టు విచారణలో ఉన్న ఒక అంశంపై పరిధులు.. పరిమితులు దాటేసి మరీ మీడియాలో ఇలా వ్యవహరించటం ఏమిటన్న ప్రశ్న తెర మీదకు వచ్చేసింది.
ఇదిలా ఉంటే.. కోర్టులో అంశానికి సంబంధించి ఆర్నాబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనంపై కేసు వేశారు శశిథరూర్. ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కాస్త ఘాటుగానే స్పందించింది. ఆర్నాబ్ తరఫు న్యాయవాది సందీప్ సేథీని సూటిగా కొన్ని ప్రశ్నలు వేసింది. ఒక వ్యక్తి లైవ్ లో ఏదో చెప్పేస్తే.. శశిథరూర్ ను దోషిగా నిర్థారిస్తారా? అంటూ ప్రశ్నించింది. కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి మీరెలా తీర్పులు ఇస్తారంటూ గట్టిగా ప్రశ్నించింది. దీంతో.. నీళ్లు నమిలిన ఆర్నాబ్ తరఫు న్యాయవాది.. చేసేదేమీ లేక చెంపలేసుకొని.. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి బయటపడాల్సి వచ్చింది. బాధ్యతతో వ్యవహరించాల్సిన మీడియా.. అత్యుత్సాహంతో వ్యవహరిస్తే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/