Begin typing your search above and press return to search.
అర్నబ్ గోస్వామీ కొత్త చానల్...నేటి నుంచే
By: Tupaki Desk | 6 May 2017 6:52 AM GMTనేషన్ వాంట్స్ టు నో... ఈ మాట వినపడితే చాలు వెంటనే గుర్తుకువచ్చే పేరు ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి. టైమ్స్ నౌ ప్రైమ్ టైమ్ లో అర్నబ్ చర్చగోష్టి రాజకీయ నాయకులకు చెమటలు పుట్టిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అంతటి ప్రత్యేకత ఇచ్చిన టైమ్స్ నౌ ఛానల్ కు పలు కారణాల వల్ల కొద్దికాలం క్రితం అర్నబ్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన ఏం చేయనున్నారు అనే సందేహాలకు తెరపడింది. కొత్తగా ఓ ఇంగ్లిష్ ఛానల్ తో అర్నబ్ ప్రేక్షకులను అలరించనున్నారు. ‘రిపబ్లిక్’ పేరుతో ఛానల్ ను రిజిస్టర్ చేయించిన అర్నబ్ నేటి నుంచి ఛానల్ ప్రసారాలను లాంచ్ చేయనున్నారు.
తన నూతన, సొంత ఛానల్ ఎందుకు తీసుకువస్తున్నానో అర్నబ్ ఒక్క మాటలో తేల్చేశారు. అదే.. ``నేషన్ స్టిల్ వాంట్స్ టు నో`` అనే క్యాప్షన్ పెట్టడం ద్వారా! ప్రముఖ పెట్టుబడిదారుడు, కర్ణాటకు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ తో కలిసి అర్నబ్ కొత్త ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ మొదలుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ లో స్టార్ ప్లస్ ను సైతం వాటాదారుడిగా చేసుకుంటున్నారని, స్టార్ ప్లస్ 26 శాతం వాటా తీసుకుంటుందని తెలుస్తోంది. కాగా, ఢిల్లీకి దగ్గరి దారిగా భావించే యూపీ ఎన్నికల నేపథ్యంలో తన ఛానల్ ను లాంచ్ చేసేందుకు అర్నబ్ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పలు కారణాల వల్ల అది వాయిదా పడింది.
కాగా, పాకిస్థాన్ కు చెంది ఉగ్ర సంస్థల నుంచి గతంలో అనేక సార్లు అర్నబ్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో వై కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వై కేటగిరి భద్రత కింద గోస్వామికి 20 మంది భద్రతా సిబ్బంది 24 గంటలూ రక్షణగా ఉంటారు. ఈ స్థాయి భద్రతను చూస్తూ పలువురు రాజకీయ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/