Begin typing your search above and press return to search.
తొలిరోజే దుమ్మురేపే టేపులు లీక్ చేసిన అర్ణబ్
By: Tupaki Desk | 6 May 2017 4:41 PM GMTప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి తన సొంత - కొత్త ఛానెల్ ప్రారంభించిన తొలిరోజే సంచలనం సృష్టించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి - ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు వెన్నులో వణుకు పుట్టే టేపులు లీక్ చేసి కలకలం రేకెత్తించాడు. తీహార్ జైల్లో జీవితఖైదులో అనుభవిస్తున్న షహబుద్దీన్ తో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతున్న ఆడియో టేప్ ను అర్ణబ్ సారథ్యంలోని రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. దీంతో బీహార్ రాజకీయాల్లో కలకలం నెలకొంది.
బీహార్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ మీడియాతో మాట్లాడుతూ లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు పాట్నాలో ఓ పెట్రోల్ పంపును 2011లో అక్రమంగా కేటాయించారని ఆరోపించారు. ఈ వార్త ప్రసారం అయిన కొద్ది గంటలకే రిపబ్లిక్ టీవీ లాలూ-షహబుద్దీన్ ఆడియో క్లిప్పింగ్ ను బయటపెట్టింది. ఈ టేపులోజైలు నుంచి లాలూకు - షహబుద్దీన్ సూచనలు ఇస్తున్నట్లు అందులో ఉంది. దీంతో విపక్షాలు లాలూ, అధికార బీజేడీలపై దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఈ క్లిప్పింగ్ పై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ బీహార్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో తెలుసుకొని దేశం నివ్వెరపోతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ బీహార్ నేత సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ లాలూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/