Begin typing your search above and press return to search.
కదిలించి తిట్టించుకున్న ట్రంప్
By: Tupaki Desk | 4 Feb 2017 4:24 AM GMTఅమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఏమేం చేయకూడదో అలాంటివే చేసే సిత్రమైన మనస్తత్వం ట్రంప్ సొంతం. హుందాగా ఉండాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే ట్రంప్ కి నోటి దూల ఎక్కువే. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. హాలీవుడ్ దిగ్గజ నటుడు ష్వార్జ్ నెగ్గర్ పై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. అందుకు ప్రతిగా ష్వార్జ్ నెగ్గర్ చేత తిట్టించుకున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం చూసినప్పుడు కదిలించి మరీ తిట్టించుకునే విషయంలో ట్రంప్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనుకోవాల్సిందే.
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి చాలా ముందు ట్రంప్ ఒక టెలివిజన్ షోను నిర్వహించేవారు. ‘‘ద న్యూ సెలబ్రిటీ అప్రెంటీస్’’ అనే ఈ షోను ఇప్పుడు హాలీవుడ్ స్టార్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ చేస్తున్నారు. మత పెద్దలు.. కాంగ్రెస్ సభ్యులతో కలిసి జాతీయప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీవీ షోను ప్రస్తావించారు. గతంలో తాను చేసిన షోను ప్రస్తుతం ఓ పెద్ద స్టార్ చేస్తున్నాడని.. అయితే రేటింగ్ బాగా పడిపోయిందంటూ ఎగతాళి వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ వ్యాఖ్యపై ష్వార్జ్ నెగ్గర్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేసిన ష్వార్జ్ నెగ్గర్.. ‘‘రేటింగ్ లో నిపుణులు కాబట్టి షో నిర్వహణ బాధ్యత మీరు తీసుకోండి. మీ స్థానంలోకి నేను వస్తా. అప్పుడు ప్రజలు తిరిగి సుఖంగా నిద్రపోతారు’’ అంటూ ఎటకారం చేసేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే.. ట్రంప్ నోటి దూలే ఆయనకు శత్రువని అర్థమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/