Begin typing your search above and press return to search.

ఆరోగ్యసేతు యాప్ త‌ప్ప‌నిస‌రి : కేంద్ర హోంశాఖ‌!

By:  Tupaki Desk   |   2 May 2020 9:20 PM IST
ఆరోగ్యసేతు యాప్ త‌ప్ప‌నిస‌రి : కేంద్ర హోంశాఖ‌!
X
క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో దేశ ప్ర‌జ‌లంద‌రూ త‌మ మొబైల్ ఫోన్ల‌లో ఆరోగ్య‌సేతు యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకోవాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు ప్రజలందరికీ ఆరోగ్యసేతు యాప్ తప్పనిసర‌ని కేంద్ర హోంశాఖ‌ ప్రకటించింది. ముఖ్యంగా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారికి ఇది ముఖ్యమని పేర్కొంది.

దీనివల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది. ఈ యాప్ ని ప్రభుత్వం ఏప్రిల్ వారారంభంలో ప్రవేశపెట్టింది. దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని, ఇందుకు అధికారులు కూడా వారికి సహకరించాలని సూచించిన హోం శాఖ.. ఇప్పటికే ఈ యాప్ ని వాడుతున్న వారి సంఖ్య దేశంలో ఏడున్నర కోట్లకు పైగా ఉన్నట్టు వెల్లడించింది. వైరస్ లక్షణాలను, హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీన్ని రూపొందించిన ఐటీ సంస్థలను ప్రభుత్వం అభినందించింది.

ఉద్యోగులు విధులకు హాజరయ్యే ముందు యాప్‌లోని స్టేట్‌సను పరిశీలించాలని సూచించింది. ‘సేఫ్‌’ లేదా ‘లో రిస్క్‌’ స్టేటస్‌ ఉంటే.. వారు నిరభ్యంతరంగా ఆఫీసులకు రావొచ్చని తెలిపింది. త్వరలోనే లాక్ ‌డౌన్ ముగుస్తుందని, అయితే యాప్ మాత్రం కరోనా పై శాశ్వత విజయం సాధించేంతవరకూ ప్రజలకు సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కరోనా ప్రమాదాన్ని అంచనా వేసేందుకు పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆరోగ్య సేతు యాప్‌ను ప్రవేశపెట్టారు.