Begin typing your search above and press return to search.

ఒకేరోజు 400 పాజిటివ్‌ కేసులు..మర్కజ్‌ తో ప్రమాదంలో భారత్‌

By:  Tupaki Desk   |   2 April 2020 2:00 PM GMT
ఒకేరోజు 400 పాజిటివ్‌ కేసులు..మర్కజ్‌ తో ప్రమాదంలో భారత్‌
X
భారతదేశంలో ఇన్నాళ్ల పాటు వందల సంఖ్యలో ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పుడు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒక వర్గం చేసిన తప్పునకు ఇప్పుడు భారతదేశం ప్రమాదంలో పడింది. మొన్నటి వెయ్యి కూడా దాటని కరోనా కేసులు ఇప్పుడు ఏకంగా మూడు వేలకు చేరువయ్యాయి. అయితే గురువారం ఒక్కరోజే 400 పాజిటివ్‌ కేసులు నమోదవడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 1,965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. నిజాముద్దీన్ జమాతే వల్లే 400 పాజిటివ్ కేసులు వచ్చాయని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రతిరోజూ ప్రెస్మీట్‌లో భాగంగా ఆయన గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో ఏకంగా ఇన్ని కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన తొమ్మిది వేల మందిని తాము గుర్తించామని, వారందర్నీ క్వారంటైన్‌కు తరలించినట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఒక్క మర్కజ్‌ ప్రార్థనలే భారతదేశంలో కరోనా వ్యాప్తిని తీవ్రం చేసింది. ఇన్నాళ్లు కట్టడికి వచ్చిన కరోనా ఇప్పుడు కరోనా కల్లోలం సృష్టిస్తోంది.

గత నెలలో జరిగిన మర్కజ్‌ ప్రార్థనల్లో 1,300 మంది విదేశీయులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు కరోనా సోకిన 400 మందితో 1,950 మందికి సంబంధం ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 324 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారు నిర్లక్ష్యం చేయడంతో కరోనా మహమ్మారితో 12 మంది చనిపోయారు. ఆ మతానికి చెందిన వారి వలన దేశంలో కరోనా తీవ్రమవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఏకంగా ఆ మతపెద్ద కరోనాకు మద్దతు తెలిపి అందర్నీ సామూహికంగా ఉండేలా చేశారు.. ప్రజలను గుంపుగుంపులుగా ఉండేలా చేయడంతో కరోనా ఒకరి నుంచి ఒకరికి పాకింది.

ప్రస్తుతం మర్కజ్‌ వెళ్లిన వారిని గుర్తించి వారిని హోం క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మర్కజ్‌ ప్రార్థనల్లో వారు వ్యవహరించిన తీరుతో దేశం నివ్వెరపోతోంది. ప్రమాదకరమైన వైరస్‌ పట్ల ఈ విధంగా నిర్లక్షయం వహించడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోరి కోరి మృత్యువుతో పెట్టుకుంటున్నారని.. వారి వలన మరింతమందికి కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.