Begin typing your search above and press return to search.

ఈ ఏడాది స్టార్టప్ లలో 60వేల ఉద్యోగాల కోత

By:  Tupaki Desk   |   5 July 2022 2:52 AM GMT
ఈ ఏడాది స్టార్టప్ లలో 60వేల ఉద్యోగాల కోత
X
కరోనా మహమ్మారి ధాటికి ఉద్యోగ, ఉపాధి కరువైంది. ఇక దాని వల్ల వచ్చిన ఆర్థికమాంద్యంతో అంతా అతలాకుతలమైంది. ఆర్థిక మాంద్యం భయాలతో స్టార్టప్ సంస్థలు కుదేలవుతున్నాయి. నిధుల కొరతతో ఈ కంపెనీలు ఇప్పుడు నేలచూపు చూస్తున్నాయి. దీంతో నిర్వహణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. ఈ ఏడాది మొత్తంగా భారత్ లో స్టార్టప్ సంస్థలు 60వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఓ ప్రముఖ నివేదిక అంచనావేసింది. ఇప్పటికే పలువురు పలు ప్రముఖ స్టార్టప్ సంస్థలు దాదాపు 12వేల మంది ఉద్యోగులను ఇంటిదారి చూపించాయి.

దీంతో ఉద్యోగులు తమ ఉద్యోగాలను పెద్ద ఎత్తున కోల్పోతున్నారు. కరోనా తర్వాత అందరి పనివిధానం మారింది. వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతితోపాటు ఆన్ లైన్ సేవలందించే సంస్థలు స్టార్టప్ సంస్థలు పుట్టుకొచ్చాయి. గడిచిన కరోనా కాలంలోని రెండేళ్లలో ఆంతా ఆన్ లైన్ ఉద్యోగాలే నడిచాయి. ఇప్పుడిప్పుడే ఉద్యోగులు ఆఫీసుల బాటపడుతున్నాయి. మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఐటీ సంస్థలు మొదలు అన్ని రకాల పరిశ్రమలు డిజిటలైజేషన్ కు ప్రాధాన్యం ఇస్తారని వార్తలొచ్చాయి. కానీ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం పరిస్థితులను మార్చేసింది. వివిధ వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో కీలక వడ్డీ రేట్లుసైతం పెరిగాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుపోయింది.

ఆర్థిక మాంద్యం దెబ్బకు అమెరికాలో 22వేల మంది ఐటీ నిపుణుల ఉద్యోగాలు గల్లంతయ్యాయి. ఈ మాంద్యం ఎఫెక్ట్ అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ లోని స్టార్టప్ సంస్థల్లో పనిచేస్తున్న 12 వేల మంది ఐటీ నిపుణులు కూడా నిరుద్యోగులయ్యారు. కరోనా మహమ్మారి ఉధృతి వేళ లబ్ది పొందిన స్టార్టప్ సంస్థలు ఇప్పుడు వాటి విలువ విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నిరుత్సాహ పూరిత వాతావరణంలో కొత్తగా నిధులు సమకూర్చుకోవడంలో స్టార్టప్ లు ఇబ్బందులు పాలవుతున్నాయి.

ఇప్పటికే అంతర్జాతీయంగా నెట్ ఫ్లిక్స్ , రాబిన్ హండ్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు, పలు క్రిప్టో ఫ్లాట్ ఫామ్స్ తమ సిబ్బందిలో కోత విధించాయి. క్రిప్టో వరల్డ్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఆర్థికంగా పతనం కావడంతో కాయిన్ బేస్, జెమినీ, క్రిప్టో డాట్ కామ్, వౌల్డ్, బైబిట్, బిట్ పాండా తదితర క్రిప్టో ఎక్స్జేంజ్ లు, సంస్థలు తమ ఉద్యోగులను కుదించుకుంటున్నట్లు ప్రకటించాయి. పోకేమోన్ గో గేమ్ డెవలపర్ నియాంటిక్ 8 శాతం తమ సిబ్బందిని కంపెనీ నుంచి వైదొలగాలని కోరింది.

ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు ఎలన్ మస్క్ తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో 10శాతం సిబ్బందిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు స్టార్టప్ లు దాదాపు 12వేల మంది ఉద్యోగులను ఇండ్లకు పంపించాయి. సంస్థల పునర్వ్యవస్థీకరణ, పొదుపు చర్యల పేరిట కొన్ని స్టార్టప్ సంస్థలు ఈ ఒక్క ఏడాదిలోనే కనీసం 50వేల మందిని తొలగిస్తామని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు