Begin typing your search above and press return to search.
ఏపీ నాలుగోదశ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం
By: Tupaki Desk | 20 Feb 2021 2:45 PM GMTఆంధ్రప్రదేశ్ లో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రేపు ఉదయం నుంచి ఈ ఎన్నికలు జరుగనున్నాయి.
నాలుగోదశ పంచాయతీ ఎన్నికల కోసం 28995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 6047 సమస్యాత్మాక, 4967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామన్నారు.కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేశామని.. సెంటర్ల దగ్గర సీసీ వీడియో రికార్డు కూడా చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తుదిదశ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని పోలీసులు ధీమాతో ఉన్నారు.
4వ విడత గుంటూరు డివిజన్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రలోభాలు పీక్ స్టేజికి చేరినట్లు సమాచారం. ఆదివారం పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే గ్రామాల్లో మద్యం, నగదుతోపాటు ప్రత్యేక బహుమతులు కూడా నాయకులు అందిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. బాగా డబ్బు, రాజకీయం మెండుగా ఉన్న ప్రాంతం కావడంతో పంచాయతీల్లో అధికార, ప్రతిపక్షాలు పట్టు నిలుపుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం, డబ్బు, గిఫ్ట్ లు, బిర్యానీ పాకెట్లు జోరుగా పంచుతున్నారు.