Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేలకు స్టార్ హోటల్..జగన్ కు గెస్ట్ హౌస్
By: Tupaki Desk | 5 March 2017 10:05 AM GMTతొలిసారి తమ సొంతగడ్డ మీద తమకు తాము నిర్మించుకున్న అసెంబ్లీ భవనంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సోమవారం వెలగపూడిలో కీలక బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎలా నిర్వహించాలి? అన్న విషయాన్ని స్పీకర్ నేతృత్వంలో అధికార.. ప్రతిపక్ష నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకోనున్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ సర్కారు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండేందుకు వీలుగా బస సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేసమయంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న ఎమ్మెల్యేలకు సైతం బస సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
అసెంబ్లీ సమావేశాలు జరిగినంత కాలం అమరావతికి సమీపంలో ఉండేలా విపక్ష నేత కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లుగా చెబుతున్నారు. ఆయనకు విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. జగన్ కు ఇబ్బంది ఏర్పడకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ భవనంతో జగన్ ఛాంబర్ ను టాయిలెట్ దగ్గర ఏర్పాటు చేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తిన వేళ.. జగన్ బస విషయాన్ని జాగ్రత్తగా చూడాలంటూ సూచించినట్లుగా తెలుస్తోంది.
జగన్ కోసం విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను సిద్ధం చేస్తున్న అధికారులు.. సమావేశాల్లో పాల్గొనటానికి వచ్చే ఎమ్మెల్యేలకు వివిధ స్టార్ హోటళ్లలో బస సౌకర్యాన్నిఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సంగతేమో కానీ.. బస కోసం స్టార్ హోటళ్లను ఎమ్మెల్యేలకు కేటాయించటం ద్వారా సమావేశాలు ముగిసే నాటికి ఎన్ని కోట్ల బిల్లు రెఢీ అవుతుందోనన్నది ప్రశ్నగా మారింది.
రికార్డు వ్యవధిలో ఆరున్నర నెలల్లో అసెంబ్లీ భవనాన్ని సిద్ధం చేసినట్లుగా చెప్పుకునే ఏపీ సర్కారు.. కాస్త ఆలస్యమైనా.. బస ఏర్పాట్లకు సంబంధించిన కూడా భవనాల్ని సిద్ధం చేయిస్తే బాగుండేది. అప్పటివరకూ అసెంబ్లీ సమావేశాల్ని హైదరాబాద్ లో నిర్వహిస్తే సరిపోయేది. ఎవరో తరుముతున్నట్లుగా హడావుడితో అరకొర నిర్మాణాలు పూర్తి చేసేసి సభల్ని నిర్వహించటం ద్వారా మరింత ఖర్చు అవుతుందన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలకు క్వార్టర్లు కేటాయించిన వైనాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వేళ.. ఆచితూచి ఖర్చు పెట్టాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా ఖర్చు చేయటం ఏ మాత్రం బాగోలేదన్న విమర్శ వినిపిస్తోంది.
తాజాగా నిర్వహించనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా.. సభకు వచ్చే ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల బస కోసం స్టార్ హోటళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రజాధనం భారీగా ఖర్చుకావటం ఖాయం. అదే హైదరాబాద్ లో నిర్వహించుకుంటే.. అయ్యే ఖర్చు తక్కువ. అలా అని హైదరాబాద్ లోనే ఎప్పటికి సభను నిర్వహించుకోవటం కాకున్నా.. అన్ని వసతులు సిద్ధమయ్యే వరకూ హైదరాబాద్ లో సభను నిర్వహిస్తే సరిపోయేది. రికార్డు సమయంలో కట్టడాల్ని కట్టిస్తున్నామన్న పేరు మోజులో.. భారీగా పెడుతున్న ఖర్చుల్ని సీఎం చంద్రబాబు పట్టించుకోవటం లేదన్న వాదన వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/