Begin typing your search above and press return to search.
హవ్వ: మానవహక్కుల గురించి పాక్ నీతులు
By: Tupaki Desk | 6 Nov 2015 7:57 AM GMTమటన్ షాపు లేదా చికెన్ షాపు నడిచే వారు జీవహింస గురించి చెబితే ఎలా ఉంటుంది? ఎబ్బెట్టుగానే కాదు ఛండాలంగా ఉంటుంది కదా! సరిగ్గా ఇపుడు అలాంటి పనే చేసింది మన పొరుగుదేశం పాకిస్తాన్. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జమ్ముకాశ్మీర్ పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలను తనదైన శైలిలో విశ్లేషిస్తూ నీతులు చెప్పింది. అది కూడా మానవహక్కులు - ప్రజాస్వామ్య విలువలు పాటించే మనదేశానికి...తీవ్రవాదానికి పెట్టింది పేరయిన పాక్ చెప్పడం ఇక్కడ ట్విస్ట్.
ఇంతకీ విషయం ఏంటంటే...జమ్మూ కాశ్మీర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా లక్షలాది మందితో మోడీ సభ జరిగే వేదికకు అత్యంత సమీపంలో వ్యతిరేక సభ నిర్వహించాలని హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు నిర్ణయించారు. ఈ సభకు పెద్ద ఎత్తున రావాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అయితే భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు హురియత్ నాయకులను అరెస్టు చేశారు.
ఈ అరెస్టుతో ఒక్కసారిగా పాకిస్థాన్ కు మానవ హక్కులు గుర్తుకువచ్చాయి. వారి అరెస్టును మానవ హక్కుల ఉల్లంఘనగా ఆ దేశం అభివర్ణించింది. కాశ్మీరీల గొంతును నొక్కేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నానికి నిదర్శనమే ఈ అరెస్టులంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిథి ఖ్వాజీ ఖలీలుల్లా పేర్కొన్నారు. దశాబ్దాలుగా భారత ఆక్రమణలో మగ్గుతున్న ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం చేసుకున్న పోరాటాన్ని భారత్ పాశవిక బలంతో అణచివేయాలని చేస్తున్నదని కూడా సదరు పెద్దమనిషి ఆరోపించారు. అంతేకాదు ఈ ప్రయత్నాలను పాకిస్థాన్ ఖండిస్తున్నదని కూడా క్వాజీ ఖలీలుల్లా పేర్కొన్నారు.
మనదేశం జవానులను పాకీ-స్తానీలు అకారణంగా కాల్చిచంపితే గుర్తుకురాని మానవహక్కులు, కాశ్మీర్ భూభాగంలో తమ పౌరులతో బాంబు బ్లాస్ట్ లు చేయిస్తూ అమాయక పౌరులను పొట్టనపెట్టుకుంటే ఏ మాత్రం ఆలోచించని దేశానికి బాధ్యులు...శాంతిభ్రదతలో భాగంగా విద్వంసకర నాయకులను 'అదుపులోకి' తీసుకుంటేనే మానవహక్కులు గురించి మాట్లాడుతున్నారు. ఇదే వింత అని ఆగిపోకండి. అరెస్టులను నిరసిస్తూ..మోడీని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్ ప్రతినిధికి మద్దతుగా మాట్లాడేవారు ప్రకటనలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అవి చూసిన తర్వాత షాక్ తినే ఎపిసోడ్ ముందు ఉంది.