Begin typing your search above and press return to search.
జడ్జీలపై అనుచిత పోస్టు కేసులో ఒకరి అరెస్ట్
By: Tupaki Desk | 11 July 2021 6:30 AM GMTసుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, వారిచ్చిన తీర్పులకు దురుద్దేశాలు, కులాలు, అవినీతి ఆరోపణలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అభియోగాలపై ఏపీలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి (40) అనే వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇతడిని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈనెల 23వరకు రిమాండ్ విధించింది.
ఇక రాజశేఖర్ రెడ్డిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ వేసిన పిటీషన్ పై విచారణను ఈనెల 12కు వాయిదా వేశారు. నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
కడప లోని సరోజినినగర్ కు చెందిన రాజశేఖర్ రెడ్డి మూడేళ్లుగా కువైట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయన ఇటీవలే సొంతూరుకు తిరిగి వచ్చారు.దర్యాప్తు అధికారి సంజయ్ కుమార్ సమల్ ఆధ్వర్యంలో సీబీఐ అధికారులు రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు.. తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా పెడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభియోగాలపై అప్పటి హైకోర్టు ఇన్ చార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదులు చేశారు. దీనిపై సీఐడీ విభాగం 16 మంది వ్యక్తులు, గుర్తు తెలియని మరికొందరిపై 12 ఎఫ్ఐఆర్ లను నమోదు చేసింది.
2020 అక్టోబర్ 12న దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అన్ని ఎఫ్ఐఆర్ లను కలిపి ఒకే కేసుగా నమోదు చేసింది. దానిలో లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ15గా ఉన్నాడు. దీనిపై 2020 మే 26న దాఖలైన పిటీషన్ ను హైకోర్టు సుమోటాగా తీసుకొని కేసు నమోదు చేసింది. 93మదికి నోటీసులు ఇచ్చింది.
ఇక విచారణలో జడ్జీలపై ఆ పోస్టు తానే పెట్టానని.. తాను వాడిన సెల్ ఫోన్ బండేరు కోనవంకలో నీటి ప్రవాహంలో పడిపోయిందని.. మరో ఫోన్ తన తల్లిదగ్గర ఉందని చెప్పారు. అతడి ఫేస్ బుక్ పోస్టులో లింక్ తొలగించినట్టుగా తెలిసింది. ఇక ఈమెయిల్ ఐడీ ద్వారా ఓపెన్ చేద్దామన్న వినియోగించిన ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో తెరవడం సాధ్యం కాలేదని సీబీఐ రిపోర్టులో పేర్కొంది.
-జడ్జీలపై దూషణల కేసు వివరాలు ఇదీ
ఏపీ హైకోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో, బయటా ఆ మధ్య సాగిన దూషణల పర్వం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదైంది. అవి మందకొడిగా సాగాయి. దీంతో ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యి కేసును సీబీఐకి అప్పగించింది. అయితే సీబీఐ కూడా జడ్జిలపై దూషణల కేసులో పెద్దగా దర్యాప్తు చేయడం లేదని తెలిసింది. సీఐడీ నమోదు చేసుకున్న కేసులను మాత్రమే స్వాధీనం చేసుకున్న సీబీఐ.. విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని.. మరోసారి మధ్యంతర నివేదిక ఇచ్చి మూడు నెలల టైం కోరింది.
ఏపీ హైకోర్టు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి హైకోర్టుకు సీబీఐ మధ్యంతర నివేదిక ఇచ్చింది. పూర్తి నివేదిక ఇచ్చేందుకు మరో మూడు నెలల సమయం కావాలని సీబీఐ న్యాయవాది కోర్టును కోరగా.. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కాగా న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచారని పలువురిపై సీబీఐ గతంలో కేసులు నమోదు చేసింది.
గతంలో ఏపీ హైకోర్టు జడ్జీలను బెదిరిస్తూ ఓ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కావాలనే పెట్టారని దీని వెనుకు కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణలో ఫేక్ అకౌంట్ల నుంచి ఇవన్నీ చేశారని తేలినట్టు సమాచారం.