Begin typing your search above and press return to search.
మైనర్ ను ఆ ఎమ్మెల్యే రేప్ చేశాడంట
By: Tupaki Desk | 14 Feb 2016 6:51 AM GMTఅనుకున్నదే జరుగుతోంది. తన పాలనలో బీహార్ కు సరికొత్త ఇమేజ్ తెచ్చి పెట్టిన నితీశ్ కు పరీక్షా కాలం మొదలైనట్లుగా.. ఆ మధ్యన బీహార్ ఫలితాలు వెల్లడి సందర్భంగా పలువురు అభిప్రాయ పడ్డారు. దీనికి తగ్గట్లే కొన్ని పరిణామాలు తరచూ చోటు చేసుకోవటం గమనార్హం. ఆర్జేడీతో పొత్తుతో బీహార్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకున్న నితీశ్.. లాలూ జంట.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చాలానే తలనొప్పులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆర్జేడీ ఎమ్మెల్యేల తీరు.. బీహార్ అధికారపక్షానికి తరచూ షాకులిస్తోంది.
తాజాగా లాలూ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి. ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేయటమే కాదు.. అత్యాచారం చేసినట్లుగా కేసు నమోదైంది. అంతేకాదు.. సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని బీహార్ డీజీపీ ఆదేశించటం గమనార్హం. ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలు రావటం.. కేసు నమోదు కావటం అంత చిన్న విషయం కాదన్నది మర్చిపోకూడదు.
ఈ నెల ఆరున చోటు చేసుకున్న ఈ వ్యవహారం.. బీహార్ రాజకీయాల్లో కలకలాన్ని రేపుతోంది. అత్యాచారం చేసిన ఎమ్మెల్యే ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండేందుకు రూ.30వేలు ముట్టజెప్పే ప్రయత్నం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయటానికి వీలుగా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అధికారపార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే (జేడీయూ) ఒక కేసులో అరెస్ట్ అయిన తన భర్తను తప్పించేందుకు సాయం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ తరహా ఘటనలు నితీశ్ సర్కారు ఇమేజ్ కు భారీగా నష్టాన్ని కలిగిస్తాయన్న విషయం మర్చిపోకూడదు.