Begin typing your search above and press return to search.
రాఖీ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది!
By: Tupaki Desk | 3 April 2017 8:13 AM GMTబాలీవుడ్ లో వివాదాస్పద నటిగా పేరుపడ్డ రాఖీ సావంత్ మరో వివాదంలో చిక్కుకుంది. గతంలో పలువురు ఇతర వ్యక్తుల కారణంగా వివాదాల్లో చిక్కుకున్న రాఖీ... తాజాగా తనకు తానే వివాదంలో చిక్కుంది. ఈ వివాదానికి సంబంధించి కోర్టు జారీ చేసిన ఆదేశాలను ధిక్కరిస్తూ వచ్చిన రాఖీని అరెస్ట్ చేయాలంటూ ఓ కోర్టు వారెంట్లు జారీ చేసిన వైనం కలకలం రేకెత్తిస్తోంది.
ఈ వివాదం వివరాల్లోకెళితే... హిందువులు పవిత్ర గ్రంథంగా భావించే రామాయణం మహాగ్రంథాన్ని రచించిన వాల్మీకిపై రాఖీ వివాదాస్పద కామెంట్లు చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలు హిందూ సంఘాలు రాఖీపై లుథియానా కోర్టుకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుపై స్పందించిన కోర్టు... విచారణకు హాజరుకావాలంటూ రాఖీకి నోటీసులు జారీ చేసింది. ఇదంతా మార్చి 9 నుంచి జరుగుతూ వస్తోంది. కోర్టు నోటీసులను ఏమాత్రం ఖాతరు చేయని రాఖీ సావంత్... విచారణకు హాజరు కాలేదు.
దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు... రాఖీని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు రాఖీ సావంత్ కు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. ఆ విచారణకు రాఖీ హాజరయ్యేలా చర్యలు చేపట్టాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణకు హాజరుకాని పక్షంలో పోలీసులు రాఖీని అరెస్ట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/