Begin typing your search above and press return to search.
సచివాలయంలో గేదెలను కట్టేశారు.. అసలు సమస్య ఏంటో తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 2 Aug 2022 3:57 PM GMTఇలాంటి వింత కేసులు ఇంకా మన సమాజంలో జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు ప్రతీ ఇంటా పాడి పంట ఉండేది. గేదెలు, ఆవులను పెంచుకునేవారు. పెరటి మొత్తం వీటితోనే ఉండేవి. అప్పుడు వీటి వాసనను జనాలు పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు గేదెలు, ఆవులు ఇళ్ల మధ్యన ఉండడానికే సహించడం లేదు. గ్రామాల్లోనూ ఈ జాఢ్యం ఉందంటే అతిశయోక్తి కాదు.
గుంటూరు జిల్లా ఏటుకూరు సచివాలయాన్ని తాజాగా గేదెలతో ముట్టడించారు గ్రామస్థులు సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సచివాలయ సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన గేదెలను నిర్బందించారు సచివాలయ సిబ్బంది. రెండు రోజులుగా వాటికి గడ్డి, నీరు ఏం పెట్టకుండా మూగజీవాలను పస్తులుంచారని గ్రామస్థులు గొడవకు దిగారు.దీనిపై అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నగరపాలక సిబ్బంది , గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. గేదెలను తీసుకువచ్చిన వారే తిరిగి వాటిని అక్కడ వదిలి రావాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గొడవకు అసలు కారణం ఏంటని అందరూ ఆరాతీస్తున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏటుకూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పక్కనున్న గేదెలతో ఇబ్బంది పడుతున్నానని.. వాటి వల్ల వాసన, దోమలు విజృంభిస్తున్నాయని నగరపాలక సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.
ఏడాది కాలంగా అతడు తరచూ అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో సానిటరీ సిబ్బంది పలుమార్లు గేదెల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినా.. వారు స్పందించలేదు. దీని మీద వారు న్యాయస్తానం వరకూ వెళ్లారు.
తరచూ ఇదే సమస్యపై స్పందనలో ఫిర్యాదు రావడంతో చేసేదేమీ లేక శానిటరీ సూపర్ వైజర్ వెంకటేశ్వరరావు రైతు శ్రీనివాస్ కు చెందిన గేదెలను తీసుకొని వచ్చి సమీపంలోని సచివాలయం వద్ద కట్టేశారు. ఇక్కడ గేదెలను తీసుకువెళ్లిన అధికారులు.. దూడను తీసుకురాకపోవడంతో అది రంకెలేయడం మొదలుపెట్టింది. స్పందనలో అర్జీ పెట్టుకుంటే సమస్య పరిష్కరించకుంటే తమను సస్పెండ్ చేస్తారని.. అందుకే ఇలా గేదెలను తీసుకొచ్చి సచివాలయంలో కట్టేశామని శానిటరీ సూపర్ వైజర్ తెలిపాడు.
దీనికి నిరసనగా గ్రామస్థులు మంగళవారం సచివాలయాన్ని ముట్టడించారు. నగరపాలక సిబ్బంది, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది.