Begin typing your search above and press return to search.

కౌన్సిలింగ్ వారి ముగ్గురి మనసుల్ని మార్చలేదు

By:  Tupaki Desk   |   30 Dec 2015 5:24 AM GMT
కౌన్సిలింగ్ వారి ముగ్గురి మనసుల్ని మార్చలేదు
X
పక్కింటి కుర్రాళ్ల మాదిరి కనిపించే ముగ్గురు యువకులు.. అత్యంత రాక్షసంగా వ్యవహరిస్తూ నరరూప రాక్షసులుగా చెప్పే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరేందుకు వెళుతున్న ముగ్గురు హైదరాబాదీయుల్ని నాగపూర్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐఎస్ లో చేరి.. ఆ సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీని కలవాలన్నదే ఈ ముగ్గురు లక్ష్యంగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా ఈ ముగ్గరు డిసెంబరు నుంచి 25న ఉదయమే హైదరాబాద్ నుంచి అదిలాబాద్ కు బయలుదేరారు. ఉదయం 9 గంటలకు అదిలాబాద్ కు చేరుకున్న వీరు టాక్సీలో బాడుగకు మాట్లాడుకొని మధ్యాహ్నానానికి నాగపూర్ చేరుకున్నారు. ఆ రాత్రంతా ఎక్కడా ఉండకుండా ఉన్న వారు.. నాగపూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి శ్రీనగర్ కు వెళ్లాలన్నది వారి ఆలోచన. అంతలోనే వీరిని ఏటీఎస్.. రాష్ట్ర పోలీసులకు ఈ ముగ్గురు చిక్కారు.

శ్రీనగర్ కు వెళ్లి.. అక్కడ నుంచి ఐఎస్ లో చేరాలన్నది వీరి ఆలోచన. ఈ ముగ్గరు.. గతంలోనూ ఐఎస్ లో చేరేందుకు బయలుదేరి పోలీసులకు పట్టుబడ్డారు. అనంతరం వీరికి వీరి తల్లిదండ్రుల ఎదుట కౌన్సిలింగ్ నిర్వహించి వారికి అప్పగించారు. తాజాగా అదుపులోకి తీసుకున్న తర్వాత వీరిని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ నెల 27న సిట్ కార్యాలయానికి పిలిపించి.. అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ వీరిని విచారించిన పోలీసులకు.. యూట్యూబ్ లోని ‘‘ ...కశ్మీరీ’’ డాక్యుమెంటరీ తమపై తీవ్రప్రభావాన్ని చూపించిందని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ పక్కింటి కుర్రాళ్ల మాదిరిగా కనిపించే వీరు నరరూప రాక్షసులుగా ఎందుకు మారాలనుకున్నారు? వీరిని అంతగా ప్రభావితం చేసిన అంశాలు.. వ్యక్తులు ఎవరు? ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? అక్కడెక్కడో సిరియా సంక్షోభం మనింటి వరకూ ఎలా పాకిందన్న విషయాలపై దర్యాప్తు సంస్థలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.