Begin typing your search above and press return to search.
రాజా సింగ్ ను ఏసేద్దామని కూడా ప్లాన్ వేశారట
By: Tupaki Desk | 1 July 2016 9:32 AM GMTఅక్కడెక్కడో.. అల్లంత దూరాన ఉన్న సిరియాలో వేళ్లూరుకున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) దురాగతాల్ని చెప్పుకుంటూ.. ఆ రాక్షసుల గురించి తరచూ చెప్పుకోవటం తెలిసిందే. కానీ.. ఆ రాక్షసుల ముద్రలు మనోళ్ల మీద పడటమే కాదు.. ఆ ఉన్మాదాన్ని నెత్తికి ఎక్కించుకొని భారీ విధ్వంసం జరపాలని ప్లాన్ చేసిన తీరు విచారణ అధికారులకు సైతం షాకింగ్ గా మారింది.
హైదరాబాద్ లోని పలు దేవాలయాలు.. ప్రముఖ షాపింగ్ మాల్స్ తోపాటు.. దిల్ సుఖ్ నగర్.. మాదాపూర్ లాంటి రద్దీ ప్రాంతాల్లో బ్రసెల్స్ తరహాలో విరుచుకుపడాలన్న కుట్రకు తెర తీయటమే కాదు.. దాన్ని అమలు చేసేందుకు ప్లాన్ మొత్తం రెఢీ చేశారు. అయితే.. ఇలాంటి అంశాల్లో అలెర్ట్ గా ఉన్న ఎన్ ఐఏ.. రియాక్ట్ అయి.. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి ఐదుగురు కీలక అనుమానితులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
తాము అదుపులోకి తీసుకున్న నిందితుల్ని విచారిస్తున్న పోలీసులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పేలుళ్లతో పాటు.. భారీ విధ్వంసానికి స్కెచ్ వేసిన ఈ ఐసిస్ తీవ్రవాదులు.. పనిలో పనిగా హైదరాబాద్ లోని పలువురు ప్రముఖుల మీద గురి పెట్టారని బయటకొచ్చింది. ఈ ప్రముఖుల్లో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మట్టుబెట్టాలన్న ప్రయత్నం కూడా ఉన్నట్లుగా తేలింది.
హిందూ అనుకూల హనుమాన్ శోభాయాత్ర లాంటి కార్యక్రమాల్లోకీలకంగా వ్యవహరించే రాజాసింగ్ ను హత్య చేయాలని డిసైడ్ చేయటమే కాదు.. ఆయన ఇంటి సమీపంలో రెక్కీ నిర్వహించినట్లుగా బయటకు వచ్చింది. అయితే ఎన్ఐఏ అప్రమత్తతతో ఉండటంతో పెద్ద ముప్పే తప్పిపోయిందని చెప్పొచ్చు.