Begin typing your search above and press return to search.
పవర్ చేతికి వస్తే మొదట అతని అరెస్టేనట
By: Tupaki Desk | 6 March 2017 5:07 AM GMTఎన్నికల వేళ.. బద్నాం అయ్యే అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ ఇవ్వదు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ అధికారపక్షం ఎస్పీ వైఖరి భిన్నం. అత్యాచార కేసులో నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన మంత్రి గాయత్రి ప్రజాపతిని పదవిలో కొనసాగించే విషయంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీరు విమర్శలకు తావిస్తోంది. ఆరోపణలు వచ్చిన వెంటనే పదవులకు రాజీనామా చేసే రోజులు పోయి చాలా కాలమే అయినప్పటికీ.. కోర్టులు ఆదేశించిన తర్వాత కూడా మంత్రి పదవిలో ఉంచేసే తీరు ఈ మధ్యన మొదలైందని చెప్పాలి.
అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యాక కూడా మంత్రి పదవినిలో కొనసాగించటంపై అఖిలేశ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ.. ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ సంధించిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బెయిల్ కు వీల్లేని వారెంట్ జారీ అయ్యాక కూడా మంత్రివర్గంలో ఎలా కొనసాగిస్తారంటూ యూపీ సీఎంకు గవర్నర్ లేఖ రాయటం దుమారం రేపుతుంటే.. ఈ ఇష్యూ మీద బీజేపీ చీఫ్ అమిత్ షా ఆసక్తికర ప్రకటన చేశారు.
యూపీలో తాము అధికారంలోకి వస్తే మొదట చేసే పని.. అత్యాచార ఆరోపణలున్న మంత్రి గాయత్రి ప్రజాపతిని అరెస్ట్ చేయటమేనని ప్రకటించారు. ప్రజాప్రతి ఎక్కడ దాక్కున్నా.. ఆయన్ను వెతికి పట్టుకొని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతనే మంత్రి మీద కేసు నమోదైందని.. అరెస్ట్ చేసే విషయంలోనూ ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డ అమిత్ షా.. అధికారం చేతికి వచ్చిన వెంటనే అరెస్ట్ పక్కా అని చెప్పేస్తున్నారు. సో..యూపీలో బీజేపీ గెలిస్తే.. మొదట జరిగేది మాజీ మంత్రి(బీజేపీ గెలిచిన తర్వాత హోదా) గాయత్రి ప్రజాపతి అరెస్టేనన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/