Begin typing your search above and press return to search.
అమరావతి రైతులకు జైట్లీ వరమిచ్చేశారు!
By: Tupaki Desk | 1 Feb 2017 7:35 AM GMTకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ దఫా ఏపీని కాస్తంత బాగానే గుర్తు పెట్టుకున్నారు. గత బడ్జెట్‌లో ఏపీకి అంతంతమాత్రమే వరాలు ప్రకటించిన జైట్లీ... ఈ దఫా మాత్రం కాస్త ఫరవా లేదనిపించారు. పార్లమెంటులో కొద్దిసేపటి క్రితం బడ్జెట్ ప్రవేశపెట్టిన జైట్లీ మొదట్లోనే ఏపీ అంశాన్ని ప్రస్తావించారు. పన్ను మినహాయింపుల చిట్టా చదువుతున్న సందర్భంగా ఏపీ అంశాన్ని ప్రస్తావించిన జైట్లీ... నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను గుర్తు చేసుకున్నారు. సాగు భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులను మెచ్చుకున్న జైట్లీ ... వారికి క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాదండోయ్.... రాజధాని కోసం చంద్రబాబు సర్కారు చేపట్టిన భూసమీకరణను కూడా జైట్లీ ప్రస్తావించడం గమనార్హం. రాజధాని నిర్మాణం కోసం అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వం వినూత్న రీతిలో భూసేకరణను చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి 35 వేల ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం భావించగా, అందులో 33 వేల ఎకరాలకు పైగా భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని కూడా ఆయన పేర్కొన్నారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ద్వారా అమరావతి రైతులకు ఏ మేర లాభం చేకూరుతుందన్న విషయాన్ని పక్కనబెడితే... ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని మరీ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించడం మాత్రం కాస్తంత ఊరట కలిగించే అంశంగానే భావించాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/