Begin typing your search above and press return to search.
అరుణ్ జైట్లీని ఆకట్టుకునేందుకు కేసీఆర్ ప్లాన్
By: Tupaki Desk | 9 Sep 2017 8:57 AM GMTకేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఇటీవల ప్రత్యేక దృష్టి పెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు అదే తరహా ఆసక్తిని కనబర్చారని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీంలో కీలక మంత్రి అయిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆకట్టుకునేందుకు ఆసక్తికరమైన కార్యాచరణ ఒకటి సిద్ధం చేశారని అంటున్నారు. అదికూడా తన ఇలాకా అయిన హైదరాబాద్ వేదికగా అని పలువురు పేర్కొంటున్నారు. ఇదంతా జీఎస్టీ సమావేశం సందర్భంగా కావడం విశేషం.
మోడీ హయాంలో కీలకమైన ఆర్థిక సంస్కరణగా పేరున్న జీఎస్టీ అమలును మరింత మెరుగ్గా తీర్చిద్దేందుకు ఆయా రాష్ర్టాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని హెచ్ ఐసీసీ వేదికగా జీఎస్టీ 21వ మండలి సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి కేసీఆర్ మరింత స్పెషాలిటీ జోడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ర్టాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారందరికీ తెలంగాణ రుచులను పరిచయం చేసేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమయింది. అద్భుతమైన విందు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. దీన్ని సమన్వయం చేయాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కు సూచించారు. ఈ మేరకు తాజ్ ఫలక్ నూమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విందు భోజనానికి రావాలని వారికి సమావేశానికి హాజరైన వారికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వంటలను రుచి చూడాలని ఆహ్వానించారు. అంతేకాకుండా హైదరాబాద్ లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించాలని వారిని మంత్రి కోరారు. మొత్తంగా విందు రాజకీయంలో కేసీఆర్ ఆరితేరారని అంటున్నారు..
కాగా, జీఎస్టీ 21వ మండలి సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ర్టాల ఆర్థిక మంత్రులు - ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ర్టం తరపున ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ - ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేశారు.