Begin typing your search above and press return to search.
చెమటలు పట్టించిన కేంద్రమంత్రి
By: Tupaki Desk | 27 Sep 2015 6:58 AM GMTఓ ఘటన కేంద్ర.. రాష్ట్ర అధికారులకు చెమటలు పట్టించింది. అందరిని ఉరుకులు పట్టించటంతో పాటు.. కొద్దిసేపు గందరగోళం ఏర్పడిన వైనమిది. బీసీసీఐ మాజీ అధ్యక్షులు జగన్మోహన్ దాల్మియా ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోల్ కతా వచ్చారు.
ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన జైట్లీ కాన్వాయ్.. మిగిలిన వాహనాలు ముందుగా సూచించిన మార్గంలోకి వెళ్లగా.. మంత్రి వాహనం మాత్రం అందుకు భిన్నంగా వేరే మార్గంలోకి వెళ్లిపోయింది. దీంతో.. కాసేపు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. చివరకు జైట్లీ కారు రాజ్ భవన్ కు చేరుకుందన్న సమాచారం అందటంతో భద్రతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎందుకిలా జరిగిందన్న అంశంపై అధికారులు క్రాస్ చెక్ చేస్తే.. కేంద్రమంత్రి సెక్యూరిటీ అధికారులకు.. కోల్ కతా పోలీసులకు మధ్య ఉన్న సమాచార లోపమే దీనికి కారణంగా తేల్చారు. ఏమైనా.. కేంద్ర ఆర్థిక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి కల్పించాల్సిన భద్రత విషయంలో సమాచార లోపం తలెత్తటం చిన్న విషయం కాదు. ఇలాంటి తప్పిదాల్ని ఏ మాత్రం ఉపేక్షించటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.