Begin typing your search above and press return to search.
పీవీ పెద్ద తోపేం కాదన్న కేంద్ర మంత్రి
By: Tupaki Desk | 21 Aug 2016 6:37 AM GMTకేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి కాంగ్రెస్ పార్టీని - వారి పాలన తీరును దుయ్యబట్టారు. అయితే ఈ సందర్భంగా దేశంలో సంస్కరణలకు బీజం వేసి తద్వారా బలమైన ఆర్థిక వేదికను సృష్టించిన మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుపై నోరు పారేసుకున్నారు. జీఎస్టీపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. స్వాతంత్య్రం తరువాత కొన్ని దశాబ్దాల పాటు భారత్ అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం మాజీ ప్రధాని నెహ్రూ పాలనలో కొనసాగిన సంప్రదాయ విధానాలేనని మండిపడ్డారు. నెహ్రూ ఏలుబడిలో దేశ వృద్ధిరేటు కనీసం ఒక శాతం కూడా పెరుగలేదని జైట్లీ పేర్కొన్నారు.
నెహ్రూ సమయంలో మిగతా దేశాలు మాత్రం ప్రగతి పథంలో దూసుకుపోతే.. ఇండియా మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అన్న చందాన ఉండిపోయిందని జైట్లీ తెలిపారు. దేశ జనాభాలో ఒక శాతం కంటే తక్కువ మంది వద్ద ఫోన్లు ఉండేవన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో చేపట్టిన సంస్కరణలపై జైట్లీ మాట్లాడుతూ... పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణవేత్తో - పెద్ద సరళీకరణవేత్తో కాదని - నెహ్రూ తరహా ఆర్థిక విధానాలు విఫలమవటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పీవీ సంస్కరణలను ప్రారంభించారని జైట్లీ వ్యాఖ్యానించారు. అప్పట్లో దివాలా గండం నుంచి తప్పించుకోవడానికి మరో గత్యంతరం లేకే పీవీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. లేదంటే ఆయన కూడా మార్పులను వ్యతిరేకించే వ్యక్తే అని అన్నారు. పరోక్షంగా పీవీ సంస్కరణలను మెచ్చుకుంటూనే అంతకముందు నెహ్రూ ఏలుబడిని జైట్లీ తప్పుపట్టారు.
జీఎస్టీ రేటు ఎంత ఉండొచ్చని పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. చాలామంది పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న నేపథ్యంలో పన్ను రేట్లను తగ్గించడం సాధ్యపడదని ఆయన అన్నారు. అందరూ సక్రమంగా పన్ను చెల్లిస్తే.. పన్ను రేటును మరింత తగ్గించేందుకు వీలవుతుందన్నారు. ఎగవేతలు - మినహాయింపులు ఎంత ఎక్కువగా ఉంటే.. పన్ను రేటు కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు కూడా తిరిగి చెల్లించాలన్నారు. దేశంలో పన్నురేట్లు తగ్గాలంటే బకాయిలు ఎగ్గొట్టద్దని ఆయన సూచించారు. వస్తు తయారీ రంగం వర్ధిల్లితేనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంటుందన్న జైట్లీ.. మేక్ ఇన్ ఇండియా కేవలం నినాదం మాత్రమే కాదన్నారు.